
విశాల్ చరిత్రలో మొదటిసారి
ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ సోమవారం నాటి మార్కెట్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. దాదాపు 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది.
ముంబై: ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ సోమవారం నాటి మార్కెట్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. దాదాపు 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. సంస్థ సీఈవో విశాల్ సిక్కా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉరుకులు పరుగులు మీద సాగిన సంస్థ ప్రస్థానం ఇటీవలి నష్టాలతో మసక బారింది. దీంతో విశాల్ సీఈవో ఉన్న సమయంలో మొదటి సారి భారీ నష్టాలతో 52 వారాలా కనిష్టానికి చేరింది. 5.70 శాతంతో 1015 దగ్గర ముగిసింది. అటు సెన్సెక్స్, నిఫ్టీ కూడా ప్రధాన మద్దతుస్థాయిలకు కింద ముగిసాయి. ప్రధానంగా, ఐటీ, ఫార్మ రంగ సూచీల నష్టాలతో సెన్సెక్స్ 28 వేల దిగువన, నిప్టీ 8650 కింది దిగువన క్లోజ్ అయ్యాయి.