breaking news
visal sikka
-
గుబులు రేపుతున్న ఇన్ఫోసిస్, విప్రో లేఖలు
ముంబై: నూతన సంవత్సరం సందర్భంగా తన సంస్థలోని ఉద్యోగులకు రాసిన లేఖలో టాప్ ఐటీ దిగ్గజ కంపెనీ లుఅధిపతులు చేసిన హెచ్చరికలు ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ సేవల సంస్థలైన ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా, విప్రో ఛైర్మన్ అజీం ప్రేమ్ జీ వ్యాఖ్యలు భారతీయ ఐటీ రంగ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ప్రతిబింబించాయి. నోట్ల రద్దు, అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ను మించి సమస్యలు ఐటి రంగాన్ని పీడిస్తున్నాయన్న సంకేతాలు అందించారు. ఐటీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ మరియు ఆర్థిక సంఘర్షణల నేపథ్యంలో తీవ్ర ముప్పు ఎదుర్కోనున్నట్టు ఇద్దరు నేతలు ఉద్యోగులను హెచ్చరించడం గమనార్హం. ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా శరవేగంగా మారుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇన్ఫోసిస్ మంచి స్థానాన్ని ఆక్రమిస్తుందని చెబుతూనే, భవిష్యత్ ఐటీ రంగం ముళ్ల బాటలో నడవాల్సి వుంటుందని, ఎన్నో అడ్డంకులు, అవాంతరాలను అధిగమించాల్సి వుంటుందని విశాల్ హెచ్చరించారు. ఇన్ఫోసిస్ విలువను మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నామని, ఈ మార్గంలో ఉద్యోగుల శ్రమ, మరింత కృషి అవసరమని అన్నారు. బ్రెగ్జిట్, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, నోట్ల రద్దు, డిజిటౌజేషన్ , సైబర్ సెక్యూరిటీ సమస్యలు, పెద్ద దేశాలను పట్టి పీడిస్తున్న వలసలు, ఉగ్రవాదం తదితర ఎన్నో సమస్యలు ఐటీ రంగంపై ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడ్డారు. ముందడుగు పడకుంటే పోటీ ప్రపంచంలో వెనకబడిపోతాం. ఆటోమేషన్, టెక్నాలజీ విభాగాల్లో మరింతగా అభివృద్ధి చెందాల్సి వుంది. క్లయింట్లకు మరింత సమర్థవంతమైన సేవలను అందించాల్సి వుందపి విశాల్ చెప్పారు. విప్రో ఛైర్మన్ అజీం ప్రేమ్ జీ మరోవైపు 2016 లో ఎదునైన అడ్డంకులను, సవాళ్లను విస్మరించలేమంటూ విప్రో ఛైర్మన్ అజిం ప్రేమ్ జీ పేర్కొన్నారు. కానీ, వివాదాలపై దృష్టిపెట్టకుండా కామన్ గ్రౌండ్ పై దృష్టిపెట్టాలంటూ నాలుగు సూత్రాలను ప్రేమ్ జీ ఉద్యోగులకు సూచించారు. తోటి మానవులను గౌరవించాలని ప్రకృతి పట్ల కూడా అదే గౌరవం కలిగి ఉండాలన్నారు. అపుడు కామన్ గ్రౌండ్ ను గుర్తించడం సాధ్యమవుతుంది.సమాజాలు, ఆర్థిక వ్యవస్థలు ప్రకృతి అన్నీమానవులతో పెనవేసుకున్న బంధాన్ని, అనుసంధానం గుర్తించాలన్నారు. మన సమస్యలు, వాటి పరిష్కారాలు ఈ సంబంధాలను బలోపేతం చేసుకోవడంలోనే ఉందన్నారు. ప్రత్యీ ఉద్యోగి విలువలకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలన్నారు. ఈ సందర్భంగా రాజస్తాన్ సందర్శన, అక్కడి ప్రజల కష్టాలను, వారి పోరాటాలను తన లేఖలో విప్రో ఛైర్మన్ ఉదహరించారు. . -
విశాల్ చరిత్రలో మొదటిసారి
ముంబై: ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ సోమవారం నాటి మార్కెట్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. దాదాపు 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. సంస్థ సీఈవో విశాల్ సిక్కా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉరుకులు పరుగులు మీద సాగిన సంస్థ ప్రస్థానం ఇటీవలి నష్టాలతో మసక బారింది. దీంతో విశాల్ సీఈవో ఉన్న సమయంలో మొదటి సారి భారీ నష్టాలతో 52 వారాలా కనిష్టానికి చేరింది. 5.70 శాతంతో 1015 దగ్గర ముగిసింది. అటు సెన్సెక్స్, నిఫ్టీ కూడా ప్రధాన మద్దతుస్థాయిలకు కింద ముగిసాయి. ప్రధానంగా, ఐటీ, ఫార్మ రంగ సూచీల నష్టాలతో సెన్సెక్స్ 28 వేల దిగువన, నిప్టీ 8650 కింది దిగువన క్లోజ్ అయ్యాయి.