'అల్లూరి గడ్డపై జన్మించిన మూర్ఖుడు చిరంజీవి' | Seemndhra Student JAC Leaders Criticise Chiranjeevi | Sakshi
Sakshi News home page

'అల్లూరి గడ్డపై జన్మించిన మూర్ఖుడు చిరంజీవి'

Feb 10 2014 8:34 AM | Updated on Sep 2 2017 3:33 AM

మంత్రి పదవిని కాపాడుకోవడానికి చిరంజీవి సమైక్యాంధ్రను తాకట్టు పెట్టాలరని సీమాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు ఆరోపించారు.

న్యూఢిల్లీ: మంత్రి పదవిని కాపాడుకోవడానికి చిరంజీవి సమైక్యాంధ్రను తాకట్టు పెట్టాలరని సీమాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు ఆరోపించారు. రెండు వారాల మంత్రి పదవి కోసం ఆయన పాకులాడుతున్నారని మండిపడ్డారు. నీకు పర్యాటకు శాఖ అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాకు రూ. 500 కోట్లకు అమ్ముడు పోయారని ఆరోపించారు. ఇంకా ఎన్ని కోట్లు సందిస్తావు అంటూ ఆవేశంగా ప్రశ్నించారు.

అల్లూరి సీతారామరాజు లాంటి పోరాట యోధుడు జన్మించిన గడ్డపై జన్మించిన మూర్ఖుడివి అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పది కోట్ల తెలుగువారికి ద్రోహం చేసిన ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. సొంత జిల్లాలో అడుగు పెడితే ప్రజలు నీ కాళ్లు విరగ్గొడతారంటూ విమర్శించారు. కాగా, ఓ యువకుడు ఒంటిపై కిరోసిన పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement