హిల్లరీపై సల్మాన్‌ ఏం ట్వీట్‌ చేశాడంటే..! | Salman Khan tweets on Hillary Clinton, | Sakshi
Sakshi News home page

హిల్లరీపై సల్మాన్‌ ఏం ట్వీట్‌ చేశాడంటే..!

Nov 5 2016 4:32 PM | Updated on Sep 4 2017 7:17 PM

హిల్లరీపై సల్మాన్‌ ఏం ట్వీట్‌ చేశాడంటే..!

హిల్లరీపై సల్మాన్‌ ఏం ట్వీట్‌ చేశాడంటే..!

మరో మూడు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్వాత్ర ఇప్పుడు అగ్రరాజ్యం పోలింగ్‌ గురించే చర్చ జరుగుతోంది.

మరో మూడు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్వాత్ర ఇప్పుడు అగ్రరాజ్యం పోలింగ్‌ గురించే చర్చ జరుగుతోంది. ఈసారి అమెరికా అధ్యక్షుడు ఎవరు అవుతారు? అన్నది ఉత్కంఠ రేపుతోంది. డెమొక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ గెలుస్తారా? లేక రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజేతగా నిలుస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది.

ఈ నేపథ్యంలో హిల్లరీ క్లింటన్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెప్తూ బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఓ అనూహ్య ట్వీట్‌ చేశారు. అమెరికా అధ్యక్షురాలిగా హిల్లరీ గెలువాలని తాను ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మానవీయ విలువలు కాపాడే శక్తిని ఆమెకు దేవుడు ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్టు సల్మాన్‌ పేర్కొన్నాడు.
Advertisement
 
Advertisement
Advertisement