అనూహ్య రీతిలో పరుగులు పెట్టిన డాలర్తో రూపాయి మారకం విలువ మళ్లీ కిందకి దిగజారింది.
డాలర్కు డిమాండ్ : రూపీ డౌన్
Feb 13 2017 10:51 AM | Updated on Sep 5 2017 3:37 AM
ముంబై : అనూహ్య రీతిలో పరుగులు పెట్టిన డాలర్తో రూపాయి మారకం విలువ మళ్లీ కిందకి దిగజారింది. అంతర్జాతీయంగా అమెరికా కరెన్సీ డాలర్ బలపడుతుండటంతో రూపాయి 10 పైసలు పడిపోయి 66.98గా ట్రేడవుతోంది. డాలర్ బలపడటమే కాకుండా దేశీయంగా పారిశ్రామికోత్పత్తి క్షీణించడంతో రూపాయికు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. డిసెంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి 0.04 శాతం క్షీణించింది.
దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి భారీగా డిమాండ్ ఏర్పడుతుండటంతో డాలర్ బలపడుతుందని ఫారెక్స్ డీలర్స్ చెబుతున్నారు. ఇతర కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ బలం పుంజుకుంటుందని, దీంతో రూపాయి మీద ఒత్తిడి కొనసాగుతుందన్నారు. శుక్రవారం రోజు డాలర్తో రూపాయి మారకం విలువ స్వల్పంగా 3 పైసలు మాత్రమే పడిపోయింది. మరోవైపు మార్నింగ్ ట్రేడ్లో సెన్సెక్స్ 124.55 పాయింట్లు పైకి ఎగిసింది.
Advertisement
Advertisement