జియో డేటా రెట్టింపు : అంబానీ | Sakshi
Sakshi News home page

జియో డేటా రెట్టింపు : అంబానీ

Published Tue, Feb 21 2017 2:35 PM

జియో డేటా రెట్టింపు : అంబానీ

వచ్చే నెలల్లో ప్రస్తుతమున్న జియో డేటాను రెట్టింపు చేస్తామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. టెలికాం కంపెనీలతో సమానంగా ఛార్జీలు వేయడం ప్రారంభించినప్పటి నుంచి 20 శాతం అత్యధికంగా డేటాను అందిస్తామని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి జియో టారిఫ్‌ ప్లాన్స్ ప్రారంభిస్తామని అంబానీ చెప్పారు. దానిలో అన్ని వాయిస్ కాల్స్ ఉచితం, నో రోమింగ్ చార్జస్, నో హిడెన్ చార్జస్ అని అంబానీ మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ...  2017 వరకు అన్ని గ్రామాలను జియో కవర్ చేస్తుందని అంబానీ పేర్కొన్నారు. నెలకు 100 కోట్ల జీబీ డేటాను వినియోగదారులు వాడుతున్నారని అంబానీ చెప్పారు. అంటే రోజుకు 3.3 కోట్ల జీబీ వాడుతున్నారని తెలిపారు.దేశంలోనే అతిపెద్ద డేటా కన్జ్యూమర్ గా జియో ఉందని పేర్కొన్నారు.
 
డేటా వాడకంలో ప్రపంచంలోనే భారత్ నెంబర్ 1గా ఉందని, జియో రాకముందు మొబైల్ డేటా వాడకంలో భారత్ 150వ స్థానంలో ఉందని తెలిపారు. కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది వినియోగదారులు చేరుకున్నామని,  వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ప్రకటించారు. 
 
సంబంధిత వార్తలు..

 

Advertisement

తప్పక చదవండి

Advertisement