జియో వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ | Rel Jio tariffs in line with regulations: TRAI | Sakshi
Sakshi News home page

జియో వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌

Feb 2 2017 4:33 PM | Updated on Sep 5 2017 2:44 AM

జియో వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌

జియో వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌

తారిఫ్‌ వార్‌లో రిలయన్స​ జియో విజయం సాధించింది

ముంబై: తారిఫ్‌ వార్‌లో రిలయన్స​ జియో విజయం సాధించింది. టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్‌ జియోకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. రిలయన్స్ జియో ప్రకటించిన ఫ్రీ తారిఫ్ ఆఫర్లు జీవిత కాలం ఇవ్వడం సాధ్యం కాదని వాదించిన టెల్కోలకు షాకిస్తూ ట్రాయ్‌ జియోకు గ్నీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  జియో ప్రకటించిన వెల్‌కం ఆఫర్‌,  హ్యాపీ న్యూ ఇయర్‌​ ఆఫర్‌  రెండూ ఫండమెంటల్‌ గా వేరువేరు అని తేల్చి చెప్పింది.  రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్లలో ఎలాంటి తప్పులు దొర్లలేదని గతంలో  ప్రకటించిన ట్రాయ్ తాజా ఆదేశాలు జారీ చేసింది.  ఈ మేరకు ట్రాయ​  భారతి ఎయిర్‌టెల్‌, ఐడియా సెల్యులార్ సహా ఇతర ఆపరేటర్లకు ఈ సమాచారాన్ని ట్రాయ్‌ అందించనుంది.

కాగా   రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో ఇన్ఫోకాం  తాజా ఆఫర్‌ పై టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్‌​, ఐడియా అభ్యంతరం వ్యక్తం చేశాయి.  ముఖ‍్యంగా భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ రిలయన్స్ జియో ఫ్రీ కాలింగ్ ఆఫర్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా శాశ్వత కాలం ఫ్రీగా ఇవ్వడం సాధ్యం కాదనీ దీన్ని నిరోధించాలంటూ  టెలికాం ట్రిబ్యునల్‌ (టీడీఎస్‌ఏటి)  ఆశ్రయించిన సంగతి తెలిసిందే.  సో.. తాజా హ్యాపీ న్యూయర్‌ ఆఫర్‌ ను  జియో వినియోగదారులు  నిస్సంకోచంగా  అనుభవించవచ్చు. మార్చి  31, 2017 వరకు  జియో ఆఫర్‌ చేసిన ఉచిత డ్యాటా, వాయిస్‌ సేవలను జియో  లవర్స్‌ నిరభ్యంతరంగా ఎంజాయ్‌​ చేయడానికి ట్రాయ్‌ అనుమతినిచ్చింది.

సంబంధిత వార్తలు..

ఇంటి వద్దకే జియో సిమ్..ఎలానో తెలుసా?

జియో తరువాతి డాటా ప్లాన్‌ ఏంటి?

క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ జియో

జియో డౌన్లోడు స్పీడులో దూసుకుపోయింది!

Advertisement
 
Advertisement
Advertisement