సెల్ ఫోన్లు వాడొద్దన్నందుకు ఆత్మహత్య! | Rebuked for using mobile phones, two girls commit suicide | Sakshi
Sakshi News home page

సెల్ ఫోన్లు వాడొద్దన్నందుకు ఆత్మహత్య!

Sep 13 2014 4:26 PM | Updated on Nov 6 2018 7:56 PM

సెల్ ఫోన్లు వాడొద్దన్నందుకు ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది.

అగర్తలా: సెల్ ఫోన్లు వాడొద్దన్నందుకు ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. త్రిపుర పట్టణంలోని హాస్టల్లో ఉంటూ 10 వ తరగతి చదువుతున్న ఇద్దరు యువతలు తరచు మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ ఉండటంతో వార్డెన్ వారిని మందలించాడు. హాస్టల్లో మొబైల్ ఫోన్లు వాడకకూడదని వాళ్లకు సూచించాడు.  అయినా వారిద్దరూ ఆ మాటలను పెడచెవిన పెట్టడంతో వార్డెన్ ఆ విషయాన్ని ఆ అమ్మాయిల తల్లిదండ్రులకు తెలిపాడు.

 

ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసిందన్న కారణంతో వారు గురువారం హాస్టల్ నుంచి  పారిపోయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీస్ అధికారి ప్రదీప్ దేయ్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement