జార్ఖండ్లో అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక అత్మహత్య చేసుకుంది.
జార్ఖండ్లో అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక అత్మహత్య చేసుకుంది. కోడెర్మా జిల్లాలోని జయనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.
వారం రోజుల క్రితం ఈ బాలిక అత్యాచారానికి గురయింది. ఈ నెల 11న పాఠశాల నుంచి ఇంటికి తిరిగొచ్చిన బాలికను 24 ఏళ్ల యువకుడు బలవంతంగా నిర్జన ప్రదేశానికి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడని కేసు నమోదయింది. నిందితుడిని తర్వాత రోజు అరెస్ట్ చేశారు.