ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టగలరా? | Ranveer Singh Reaction on Deepika Padukone photo | Sakshi
Sakshi News home page

ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టగలరా?

Jul 1 2017 3:35 PM | Updated on Sep 5 2017 2:57 PM

ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టగలరా?

ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టగలరా?

పక్కన చెల్లాయితో కాలు మీద కాలు వేసుకొని.. దీర్ఘంగా చూస్తున్న ఈ బుజ్జాయి ఎవరో తెలుసా..

పక్కన చెల్లాయితో కాలు మీద కాలు వేసుకొని.. దీర్ఘంగా చూస్తున్న ఈ బుజ్జాయి ఎవరో తెలుసా.. ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌ దీపికా పదుకొణే. తాను 12 ఏళ్ల వయస్సులో ఉన్నప్పటి ఫొటో ఇది. తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. చెల్లెలు అనీషా (అప్పుడు ఏడేళ్లు)తో దిగిన ఫొటోతో కూడిన పేపర్‌ కటింగ్‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది. అప్పట్లో పాపులర్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ అయిన ప్రకాశ్‌ పదుకొనే ఇంటర్వ్యూకు సంబంధించిన పేపర్‌ కటింగ్‌ ఇది అయి ఉంటుంది.

దీపిక ఉన్న ఆమె ఫెవరేట్ గదిలో వెనుక గోడ మీద లియోనార్డ్‌ డికాప్రియో ఫొటోలు చూడవచ్చు. 1997లో వచ్చిన 'టైటానిక్‌' ఫొటోలు ఈ గదిలో ప్రధాన ఆకర్షణగా నిలువగా.. దీపిక ఫొటోలు కూడా గోడ మీద ఉన్నాయి. ఫ్లాష్‌బ్యాక్‌ ఫ్రైడే పేరిట ఆమె షేర్‌ చేసిన ఈ ఫొటోను నాలుగు లక్షలమంది లైక్‌ చేశారు. ఇక ఆమె ప్రియుడిగా ప్రచారంలో ఉన్న హీరో రణ్‌వీర్‌ సింగ్‌ కూడా ఈ ఫొటోపై స్పందించాడు. హార్ట్‌-ఐస్ ఎమిటికాన్స్‌తో అతను తన ప్రేమను చాటుకున్నాడు. ఈ ఫొటో, దానిపై రణ్‌వీర్‌ రియాక్షన్‌ అభిమానులను అలరిస్తున్నాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement