'రాహుల్ ఓ జోకర్ లా ప్రవర్తించారు' | Rahul Gandhi behaved like a 'joker' in Kerala: CPI-M leader | Sakshi
Sakshi News home page

'రాహుల్ ఓ జోకర్ లా ప్రవర్తించారు'

Jan 14 2014 3:18 PM | Updated on Sep 2 2017 2:38 AM

'రాహుల్ ఓ జోకర్ లా ప్రవర్తించారు'

'రాహుల్ ఓ జోకర్ లా ప్రవర్తించారు'

కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ సోమవారం కేరళ పర్యటనలో జోకర్ లా ప్రవర్తించారని సీపీఐ-ఎం నేత విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ సోమవారం కేరళ పర్యటనలో జోకర్ లా ప్రవర్తించారని సీపీఐ-ఎం నేత విమర్శించారు. కాంగ్రెస్ లో ప్రధాని అభ్యర్థి హోదాలో కొనసాగుతున్న రాహుల్ ఓ పోలీస్ జీప్ లో ప్రయాణించి జోకర్ లా బిహేవ్ చేశాడని వామపక్ష నేత పినరాయి విజయన్ అన్నారు. పోలీస్ జీప్ టాప్ పై ప్రయాణించడం ఆయన మానసిక స్ఠితికి అద్దం పడుతోంది అని అన్నారు. విపక్షాల విమర్శలు పక్కన పడితే.. ర్యాలీలో రాహుల్ తీరు తనను ఆకట్టుకుందని కేరళ ప్రభుత్వ చీప్ విప్ పీసీ జార్జ్ అన్నారు. 
 
నెహ్రూ, గాంధీ వంశం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ సాధారణ పౌరుల హృదయాల్లో చోటు సంపాదించడాన్ని కేరళ పర్యటనలో చూశాను అని ఆయన అన్నారు. పేద ప్రజల హృదయాల్లో చోటు ఉందని రాహుల్ కేరళ పర్యటనలో రుజువు చేసుకున్నారని జార్జ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement