కొన్ని చిరునామాలు అప్రయత్నంగానే బండగుర్తుల్లా గుర్తుండిపోతాయి. 1600, పెన్సిల్వేనియా ఎవెన్యూ ఎన్డబ్ల్యూ, వాషింగ్టన్ డీసీ.. చిరునామా వినగానే అమెరికన్లకు అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ గుర్తొస్తుంది. ఇక ఇండియాలో రాజకీయపరంగా అత్యంత శక్తిమంతమైన వ్యక్తి నివాసం ఎక్కడంటే.. '7 రేస్ కోర్స్ రోడ్, న్యూఢిల్లీ' అని ఠక్కున చెప్పేస్తాం. భారత ప్రధానమంత్రి అధికారిక నివాసం అది. ప్రస్తుతం ఆ ఇంట్లో నరేంద్ర మోదీ నివసిస్తున్నారు. అయితే ఇటీవల వెల్లువెత్తుతున్న డిమాండ్ల నేపథ్యంలో మోదీగారి ఇంటి అడ్రస్ మారిపోనుందనే భావన వ్యక్తం అవుతోంది. ఎందుకంటే..
రేస్ కోర్స్ అనే పదం భారత సంస్కృతి, సంప్రదాయాలకు ఏమాత్రం సంబంధంలేనిదని, వలస కాలం నాటి ఆ పేరును తొలిగించి 'ఏకాత్మ మార్గ్'అని పెట్టాలని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆమె ఈ మేరకు న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ)లో ప్రతిపాదన చేశారు. బీజేపీ సిద్ధాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ బావజాలం ఏకాత్మ మానవ దర్శన్ (integral humanism)ను సూచించేలా రేస్ కోర్స్ రోడ్డును 'ఏకాత్మ మార్గ్'గా మార్చాలని ఆమె ప్రతిపాదించారు.
కాగా, ఎన్డీఎంసీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు మాత్రం పేరు మార్పునకు అంగీకరిస్తూనే ఆర్ఎస్ఎస్ సంబంధిత వ్యక్తులవి కాకుండా అమరజవాన్లలో ఒకరి పేరు పెట్టాలని అంటున్నారు. 1965 యుద్ధ వీరుడు లెఫ్టినెంట్ నిర్మల్జిత్ సింగ్ పేరును ఆప్ ఎమ్మెల్యే సూచించారు. ఈ విషయంపై కౌన్సిల్ తుది తీసుకోలేదు. ఒకవేళ పేరుమార్పునకు ఓకే చెప్పినా ఇప్పటికే ఇలాంటి మార్పుల వల్ల తలెత్తిన విమర్శల నేపథ్యంలో కేంద్ర పునరాలోచించే అవకాశం లేకపోలేదు. గతంలో ఔరంగజేబ్ రోడ్డును ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చిన సందర్భంగా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
ప్రధాని మోదీ ఇంటి అడ్రస్ మారనుందా?
Published Tue, Sep 20 2016 8:14 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
అసలు ఇది చాలు! వీళ్లకు ఓటేయకుండా ఉండటానికి!
అంతా బాబే చేశారు
గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు
షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement