భారీగా పడిపోతున్న ఈ కార్ల రీసేల్‌

భారీగా పడిపోతున్న ఈ  కార్ల రీసేల్‌ - Sakshi


న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ (జిఎం)  భారతీయ కార్ల మార్కెట్‌ నుంచి నిష్క్రమించాలన్న ప్రకటన  కార్ల అమ్మకాలపై  తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.  ముఖ్యంగా  రీసేల్‌ మార్కెట్‌ లో షెవ్రోలె కార్ల ధరలు భారీగా పడిపోయాయి.  గురువారం నాటి ప్రకటన తరువాత నుంచి క్రమంగా ఈ విక్రయాలు  పడిపోతున్నాయని, ఈ ధోరణి ఇకముందుకూడా కొనసాగనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.   



గురువారం భారతదేశ దేశీయ విక్రయ మార్కెట్ నుండి నిష్క్రమించాలని ప్రధాన ప్రకటన చేసింది జినరల్‌  మోటార్‌.  దేశీయ విఫణిలో నిరంతర నష్టాలు,  చిన్న మార్కెట్ వాటా (2017 ఏప్రిల్ నాటికి 0.32 శాతం) తర్వాత కంపెనీ నిర్ణయానికి వచ్చింది.  అయితే ఈ నిర్ణయం భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌పై  పెద్దగా ప్రభావాన్ని చూపదని అంచనా వేసినప్పటికీ,  జీఎం బ్రాండ్‌  షెవ్రోలె  కార్ల పునఃవిక్రయాలపై మరింత ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీఎం ప్రకటించిన తరువాత    రీసేల్‌ మార్కెట్లో  5శాతం పడిపోయాయి.   రాబోయే రోజుల్లో 20 శాతం తగ్గుతాయని భావిస్తున్నారు.


అయితే దేశీయ విక్రయాలను నిలిపి వేసినప్పటికీ ఉత్పత్తిని కొనసాగిస్తామనీ  కార్ల విడిభాగాలు.  ఇతర  సర్వీసులను అందిస్తామని సంస్థ హామీ  ఇచ్చింది.  వారెంటీలకు సంబంధించి అన్ని ఒప్పందాలను, అమ్మకాల సేవలను గౌరవిస్తామని జిఎం వినియోగదారులకు గురువారం ప్రకటించింది. అయినా వినియోగదారుల్లో ఆందోళన నేపథ్యంలో అమ్మకాలు  వైపు మొగ్గు చూపుతుండడం  గమనార్హం.  



మరోవైపు ఈ సంవత్సరాంతానికి   సంస్థ ఆథరైజ్డ్‌ సర్వీసులు   విలువైన సేవల్ని అందించలేకపోవచ్చని ట్రూ బిల్‌ కో ఫౌండర్‌ సుభ్ బన్సాల్‌  అభిప్రాయపడ్డారు. అంతేకాదు జీఎం బ్రాండ్లకు సంబంధించి ఒరిజినల్‌  స్పేర్‌ పార్ట్స్‌ లభించడం కూడా కష్టం కావచ్చని అంచనా వేశారు.  ఒక సంస్థ అమ్మకాలను నిలిపివేసినపుడు సాధారణంగా సంవత్సరం కాలంలో క్రమంగా 10-15 శాతం ధరలు పతనం నమోదవుతుందని అయితే జీఎం కార్ల విషయంలో ఇప్పటికే 5 శాతం పతనం నమోదైందని తెలిపారు.  


కాగా డిసెంబర్‌31, 2017 నుంచి విక్రయాలు  ముగియనున్నాయని జీఎం ఇండియా ఎండీ కహర్ కజిమ్  ప్రకటించారు. అయితే, అమ్మకాల సేవలను సుదీర్ఘ కాలం పాటు కొనసాగిస్తామని చెప్పారు. అన్ని స్థానిక వాటాదారుల మద్దతు కొనసాగిస్తామనిచ భారతదేశంలో విక్రయించిన జీఎం కార్ల భాగాల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కజీమ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు  జీఎం  బీట్‌, స్పార్క్, సెయిల్‌(సెడాన్) క్రూయిజ్‌, ఎంజాయ్‌, తవేరా, ట్రయిల్ బ్లేజర్లతో సహా ఏడు మోడళ్లను విక్రయిస్తుంది.మోడళ్లను విక్రయిస్తోంది

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top