రాజ్‌భాష పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి | President Ramnath Kovind Gives Awards on Hindi Diwas | Sakshi
Sakshi News home page

రాజ్‌భాష పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి

Sep 15 2017 12:19 AM | Updated on Sep 19 2017 4:33 PM

రాజ్‌భాష పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి

రాజ్‌భాష పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి

హిందీ దివస్‌ను పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాజ్‌భాష పురస్కారాలను ప్రదానం చేశారు.

సాక్షి, న్యూఢిల్లీ: హిందీ దివస్‌ను పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాజ్‌భాష పురస్కారాలను ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు హన్సరాజ్‌ గంగారాం, కిరణ్‌ రిజిజు పాల్గొన్నారు. హిందీ భాష వృద్ధికి కృషి చేసినందుకు గానూ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి పురస్కారాలు ప్రదానం చేశారు. పురస్కారాలు అందుకున్నవారిలో వి.ఉదయ్‌ భాస్కర్‌ (హైదరాబాద్, బీడీఎల్‌), విష్ణుభగవాన్‌ శర్మ (ఎస్‌బీఐ, హైదరాబాద్‌), హోంనిధి శర్మ (బీడీఎల్, హైదరాబాద్‌), హర్‌ దయాళ్‌ ప్రసాద్‌ (ఎస్‌బీఐ, హైదరాబాద్‌), సుగుణ (విశాఖ స్టీల్‌ ప్లాంట్‌) తదితరులు ఉన్నారు. హిందీ నేర్చుకొనే వారి సౌలభ్యం కోసం ‘లీలా’మొబైల్‌ యాప్‌ను రాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రారంభించారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement