పార్టీ ఓడినా.. సీఎం గెలిచారు! | Parkash Singh Badal wins Lambi seat defeating Amrinder Singh | Sakshi
Sakshi News home page

పార్టీ ఓడినా.. సీఎం గెలిచారు!

Mar 11 2017 4:34 PM | Updated on Aug 14 2018 9:04 PM

పార్టీ ఓడినా.. సీఎం గెలిచారు! - Sakshi

పార్టీ ఓడినా.. సీఎం గెలిచారు!

పంజాబ్ లో అకాలీదళ్ శిరోమణి కోలుకోలేని దెబ్బతినగా.. ఆ పార్టీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ మాత్రం గెలుపు కిరీటం ఎగురవేశారు.

చంఢీఘర్ : పంజాబ్ లో అకాలీదళ్ శిరోమణి కోలుకోలేని దెబ్బతినగా.. ఆ పార్టీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ మాత్రం గెలుపు కిరీటం ఎగురవేశారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అమరీందర్ సింగ్ పై లాంబీ నియోజకవర్గం నుంచి ప్రకాశ్ సింగ్ బాదల్ గెలిచారు. శనివారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో 22వేలకు పైగా ఓట్లతో ఆయన అమరీందర్ సింగ్ ను ఓడించారు. అయితే అమరీందర్ సింగ్ పటియాలా-అర్బన్ ను తన ఖాతాల్లో వేసుకుని, కంఫర్ట్ జోన్ లో ఉన్నారు.  అమరీందర్ కు తన సంప్రదాయ అసెంబ్లీ నియోజకవర్గం పటియాలా నుంచి, లాంబి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
 
లాంబీలో అమరీందర్ ఓటిపోగా.. పటియాలాలో గెలుపొందారు. పటియాలాలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి బల్బీర్ సింగ్ పై అమరీందర్ 52,407 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మరోవైపు పంజాబ్ లో అకాలీదళ్ శిరోమణి ఓటమిని అంగీకరిస్తామని, ఓటమికి గల కారణాల ప్రతి అంశాన్ని పూర్తిగా విశ్లేషిస్తామని ప్రకాశ్ సింగ్ బాదల్ తెలిపారు. రేపు( ఆదివారం) పంజాబ్   సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్టు చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement