'బ్లేమ్ గేమ్' వద్దు.. చర్చలు ముద్దు... | Pakistan terms Narendra Modi's comments on terrorism as baseless rhetoric | Sakshi
Sakshi News home page

'బ్లేమ్ గేమ్' వద్దు.. చర్చలు ముద్దు...

Aug 13 2014 12:30 PM | Updated on Apr 3 2019 3:50 PM

'బ్లేమ్ గేమ్' వద్దు.. చర్చలు ముద్దు... - Sakshi

'బ్లేమ్ గేమ్' వద్దు.. చర్చలు ముద్దు...

తీవ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తుందని భారత్ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ ఖండించింది.

ఇస్లామాబాద్: తీవ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తుందని భారత్ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ ఖండించింది. మోడీ వ్యాఖ్యలను ఆధారరహిత వాక్పటిమగా కొట్టివేసింది. పరస్పర విమర్శలు మానుకోవాలని సూచించింది. 'బ్లేమ్ గేమ్' బదులు చర్చల ద్వారా ఇరు దేశాలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని పాకిస్థాన్ విదేశాంగ వ్యవహారాల కార్యాలయం పేర్కొంది.

భారత్‌పై పాకిస్థాన్ పరోక్ష యుద్ధానికి పాల్పడుతోందని.. దేశంలో అమాయక ప్రజలను హతమారుస్తోందని జమ్మూకాశ్మీర్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంప్రదాయ యుద్ధానికి దిగే దమ్ము లేక పరోక్ష యుద్ధానికి పాల్పడుతోందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement