లాడెన్ ఆల్ఖైదా పేరు మార్చాలనుకున్నాడా ? | Sakshi
Sakshi News home page

లాడెన్ ఆల్ఖైదా పేరు మార్చాలనుకున్నాడా ?

Published Thu, Feb 19 2015 10:23 AM

లాడెన్ ఆల్ఖైదా పేరు మార్చాలనుకున్నాడా ? - Sakshi

వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఆ సంస్థ పేరు మార్చాలనుకుంటున్నారా ? అంటే అవుననే అంటున్నాయి అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ వర్గాలు. యూఎస్ సైన్యం చేతిలో లాడెన్ హతమయ్య కొద్ది రోజుల మందు.. ఆల్ ఖైదా సంస్థ పేరు మార్చాలని భావించాడని.. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నిస్ట్ బుధవారం వాషింగ్టన్లో వెల్లడించారు. యూఎస్లో డబ్ల్యూటీసీ టవర్పై దాడి చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో విధ్వంసానికి పాల్పడటంతో లాడెన్ ఆలోచనలో పడ్డాడు.

అల్ ఖైదా మారణహోమానికి ప్రతీకగా నిలిచిందని లాడెన్ భావించాడు. ఇలాగే విధ్వంసం సృష్టిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆల్ ఖైదాకు మరింతచెడ్డ పేరు వస్తుందని అనుకున్నాడు. ఆ క్రమంలో ఆల్ ఖైదా పేరు మార్చాలనుకున్నాడు... అది కూడా ఇస్లాం మాతానికి చాలా దగ్గరగా ఉండేలా కొత్త పేరు పెట్టాలనుకున్నాడు. ఆ దిశగా ఆలోచనలు చేస్తూ...ఆల్ఖైదా నాయకులతో సమాలోచన చేసేందుకు చర్యలు కూడా చేపట్టాడని ఎర్నెస్ట్ వివరించారు.

ఇంతలో లాడెన్ పాకిస్థాన్ అబోటాబాద్లోని బిలాల్ పట్టణంలో ఉన్నట్లు గుర్తించిన యూఎస్ సైన్యం... 2011, మే 2వ తేదీన అతడి నివాసంపై దాడి చేసి... అతడ్ని అంతమెందించింది. అనంతరం అతడి మృతదేహాన్ని యూఎస్ సైన్యం సముద్రంలో పడి వేసిన విషయం విదితమే.అయితే లాడెన్ను చంపేసిన తర్వాత అతడి నివాసంలో యూఎస్ సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో పలు కీలకమైన పత్రాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఆ పత్రాలను పరిశీలించిన యూఎస్ ఉన్నతాధికారులకు పలు ఆసక్తికరమైన అంశాలు
తెలిశాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement