‘త్రి’షోదయ వేళ | Once the temperature dropped to minus 25 degrees | Sakshi
Sakshi News home page

‘త్రి’షోదయ వేళ

Feb 23 2015 3:23 AM | Updated on Apr 3 2019 4:43 PM

చెరువు గట్టు.. పక్కనే పచ్చని పొలాలు.. మంచు తెరల చాటు నుంచి సూర్యుడు తొంగి చూసే ఆ ఉషోదయ వేళ మనసు పరవశించకుండా ఉంటుందా..!

చెరువు గట్టు.. పక్కనే పచ్చని పొలాలు.. మంచు తెరల చాటు నుంచి సూర్యుడు తొంగి చూసే ఆ ఉషోదయ వేళ మనసు పరవశించకుండా ఉంటుందా..!  మరి ఒకే సారి మూడు ఉషోదయాలు కనువిందు చేస్తే...! అదీ నీలి బ్యాక్ గ్రౌండ్‌లో కనిపిస్తే ఆహా! ఆ అనుభూతే వేరు కదా.. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా..! ఇది నిజంగా నిజమండీ బాబూ... ఈ కమనీయ దృశ్యం రష్యాలోని చెల్యాబిన్స్క్ నగర ప్రజలను మంత్ర ముగ్ధుల్ని చేసింది.

ఇటీవల అక్కడి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మైనస్ 25 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో వాతావరణంలో ఏర్పడిన కంటికి కనిపించని మంచు స్ఫటికాల వల్ల ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. దీన్నే భౌతిక శాస్త్ర పరిభాషలో ‘సన్‌డాగ్’ లేదా ‘ఫాంటమ్ సన్’ అని పిలుస్తారు. షట్కోణాకృతిలో ఉండే ఈ మంచు స్ఫటికాలు పట్టకాల లాగా పనిచేయడం వల్ల సూర్యకిరణాలు వక్రీకరణం చెంది ముగ్గురు సూర్యుళ్లు ఉదయించినట్లు కనిపించింది. అయితే ఇది రష్యన్లకు సర్వ సాధారణమేనంట..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement