టీఆర్‌ఎస్‌కే ఓటేస్తామని మాటివ్వాలి | old man bsnl tower | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కే ఓటేస్తామని మాటివ్వాలి

Jan 29 2016 3:30 AM | Updated on Sep 3 2017 4:29 PM

‘నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కే అందరూ ఓట్లు వేసి గెలిపించాలి. ఈ మేరకు గ్రామ పెద్దలు మాటివ్వాలి’ అంటూ...

కంగ్టి: ‘నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కే అందరూ ఓట్లు వేసి గెలిపించాలి. ఈ మేరకు గ్రామ పెద్దలు మాటివ్వాలి’ అంటూ ఓ వృద్ధుడు సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన మెదక్ జిల్లా కంగ్టి మండలం తడ్కల్‌లో గురువారం మధ్యాహ్నం కలకలం రేపింది. చౌకన్‌పల్లికి చెందిన పీరప్ప జై తెలంగాణ నినాదాలు చేస్తూ తడ్కల్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఎక్కాడు. అందరూ టీఆర్‌ఎస్‌కి ఓటేస్తామని మాటిచ్చే వరకు దిగనంటూ భీష్మించుకొని కూర్చున్నాడు. పోలీసులు అతడిని కిందకు దింపేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఐదున్నర గంటల హైడ్రామాతో పాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

చివరకు అక్కడ గుమిగూడిన వందలాది మంది ప్రజలు ‘టీఆర్‌ఎస్‌కే ఓటేస్తాం’ అని మైక్‌లో చెప్పారు. దీంతో పీరప్ప కిందకు దిగాడు. అనంతరం పీరప్పను పోలీసులు అదుపులోకి తీసుకొని కంగ్టి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement