రైల్లో భారీగా పాత రూ.500 నోట్లు | Old 500 notes worth Rs 35 lakhs seized from an abandoned bag in Jan Shatabdi express train in Gaya | Sakshi
Sakshi News home page

రైల్లో భారీగా పాత రూ.500 నోట్లు

Dec 7 2016 11:23 AM | Updated on Sep 4 2017 10:09 PM

రైల్లో భారీగా పాత రూ.500 నోట్లు

రైల్లో భారీగా పాత రూ.500 నోట్లు

బీహార్ లోని గయనలో ఇఒక రైలు బోగీలో 35 లక్షల విలువైన రద్దయిన రూ.500 సంచిని అధికారులు గుర్తించారు.

బిహార్: డీమానిటైజేషన్ తరువాత రద్దయిన రూ.500, 1000 నోట్లు పెద్ద ఎత్తున పట్టుబడుతున్న సంఘటనలు ఇంకా నమోదవుతూనే వున్నాయి.  తాజాగా   బీహార్ లోని గయనలో ఇఒక  రైలు బోగీలో  35 లక్షల  విలువైన రద్దయిన  రూ.500 సంచిని అధికారులు  గుర్తించారు.  శతాబ్ది ఎక్స్ప్రెస్ లో  గుర్తుతెలియని బ్యాగ్ నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు.  రైల్వే స్టేషన్‌ కస్టమ్స్ అధికారులు ఈ భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు.

కాగ నవంబరు 8 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు దేశవ్యాప్తంగా సంచలనంగా  మారింది. నల్లధనాన్ని అరికట్టేందుకు  కేంద్రం చేపట్టిన ఈ చర్య సామాన్యలకు పలు కష్టాలను తెచ్చిపెట్టింది.   నగదు కొరత సమస్యను అధిగమించేందుకు ఆర్థిక శాఖ, ఆర్ బీఐ ఎన్ని ఉపశమన చర్యల్ని  చేపడుతున్నప్పటికీ కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి.ఏటీఎం, బ్యాంకు కేంద్రాల వద్ద  జనం క్యూలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement