నరేంద్ర మోదీ మొబైల్ యాప్ | Now, an app to interact with PM | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోదీ మొబైల్ యాప్

Aug 4 2015 8:32 PM | Updated on Aug 15 2018 2:32 PM

నరేంద్ర మోదీ మొబైల్ యాప్ - Sakshi

నరేంద్ర మోదీ మొబైల్ యాప్

సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మోదీ.. ఐఫోన్ యూజర్ల కోసం ఓ యాప్ను అందుబాటులో ఉంచారు.

న్యూఢిల్లీ: భారత రాజకీయ నేతల్లో సోషల్ మీడియాను వాడుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీదే అగ్రస్థానం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మోదీ.. ఐఫోన్ యూజర్ల కోసం ఓ యాప్ను అందుబాటులో ఉంచారు. ఐఫోన్ యూజర్లు ఇక నుంచి మోదీతో ఇంటరాక్ట్ కావచ్చు. ఇందుకోసం 'నరేంద్ర మోదీ మొబైల్ యాప్'ను రూపొందించారు. ఈ యాప్ను http://nm4.in/nmiosapp లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు.

'ప్రధాని నరేంద్ర మోదీ అధికార యాప్ ఇది. దీని ద్వారా తాజా సమాచారం, అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అంతేగాక మోదీ నుంచి నేరుగా ఈమెయిల్స్, మెసేజ్లు పొందవచ్చు' అని యాప్ స్టేటస్లో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement