1800 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్‌ | notification for 1800 home guard posts | Sakshi
Sakshi News home page

1800 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్‌

Nov 2 2016 6:07 PM | Updated on Sep 4 2017 6:59 PM

1800 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్‌

1800 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్‌

సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో 1,800 హోంగార్డుల పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్‌ వెలువడనుంది.

హైదరాబాద్‌: సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో 1,800 హోంగార్డుల పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఒక్కో కమిషనరేట్‌లో 900 చొప్పున ఉన్న పోస్టులకు ఆయా కమిషనరేట్ల పరిధిలో నివసించే వారు అర్హులు.  

ఈ నెల 5  నుంచి 25 వరకు దరఖాస్తులను విక్రయించనున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని వారు గచ్చిబౌలిలోని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌లో, రాచకొండ పరిధిలోని వారు అంబర్‌పేటలోని పోలీస్‌హెడ్‌ క్వార్టర్స్‌లో దరఖాస్తులు పొందవచ్చు. ఇక్కడే అభ్యర్థుల వివరాలను నమోదు చేసుకుంటామని కమిషనర్లు సందీప్‌ శాండిల్య, మహేష్‌ భగవత్‌ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement