అన్నదాతకు ఊరట.. వడ్లకు రికార్డు ధర! | Telangana Farmers Paddy Demand | Sakshi
Sakshi News home page

అన్నదాతకు ఊరట.. వడ్లకు రికార్డు ధర!

Oct 24 2026 9:36 AM | Updated on Oct 24 2026 9:37 AM

Telangana Farmers Paddy Demand

మహబూబాబాద్‌: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో జైశ్రీరాం రకం ధాన్యానికి(పాతవి)రికార్డు ధర రూ.5,016 పలికింది. కొద్దిరోజులుగా మార్కెట్‌లో సన్నరకం పాత ధాన్యానికి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈనెల 16న మార్కెట్‌కు వచ్చిన ఒక కూటు జైశ్రీరాం రకానికి చెందిన ధాన్యానికి క్వింటాకు గరిష్ట ధర రూ.4,901 పలుకగా, ఆర్‌ఎన్‌ఆర్‌ రకానికి గరిష్ట ధర రూ.4,301, కనిష్ట ధర రూ.3,589, హెచ్‌ఎంటి రకానికి గరిష్ట ధర రూ.4,601, కనిష్ట ధర రూ.4,169 పలికింది. 

కాగా, శుక్రవారం మార్కెట్‌కు వచ్చిన ఒక కూటు జైశ్రీరాం రకానికి క్వింటాకు గరిష్ట ధర రూ.5,016 పలికింది. అదే విధంగా 57 బస్తాల ఆర్‌ఎన్‌ఆర్‌ రకానికి చెందిన ధాన్యం అమ్మకానికి రాగా, క్వింటాకు గరిష్ట ధర రూ.4,782, కనిష్ట ధర రూ.4,089 పలికినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు. ధాన్యం ధరలు పెరుగుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

ఇదీ చదవండి: సన్నాలకు సిరులు.. ఆనందంలో అన్న‌దాత‌లు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement