breaking news
demand by formers
-
అన్నదాతకు ఊరట.. వడ్లకు రికార్డు ధర!
మహబూబాబాద్: కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో జైశ్రీరాం రకం ధాన్యానికి(పాతవి)రికార్డు ధర రూ.5,016 పలికింది. కొద్దిరోజులుగా మార్కెట్లో సన్నరకం పాత ధాన్యానికి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈనెల 16న మార్కెట్‌కు వచ్చిన ఒక కూటు జైశ్రీరాం రకానికి చెందిన ధాన్యానికి క్వింటాకు గరిష్ట ధర రూ.4,901 పలుకగా, ఆర్ఎన్ఆర్ రకానికి గరిష్ట ధర రూ.4,301, కనిష్ట ధర రూ.3,589, హెచ్ఎంటి రకానికి గరిష్ట ధర రూ.4,601, కనిష్ట ధర రూ.4,169 పలికింది. కాగా, శుక్రవారం మార్కెట్‌కు వచ్చిన ఒక కూటు జైశ్రీరాం రకానికి క్వింటాకు గరిష్ట ధర రూ.5,016 పలికింది. అదే విధంగా 57 బస్తాల ఆర్ఎన్ఆర్ రకానికి చెందిన ధాన్యం అమ్మకానికి రాగా, క్వింటాకు గరిష్ట ధర రూ.4,782, కనిష్ట ధర రూ.4,089 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ధాన్యం ధరలు పెరుగుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: సన్నాలకు సిరులు.. ఆనందంలో అన్నదాతలు -
‘చింతలపూడి’ కాలువ పనులకు ఆటంకం
చింతలపూడి: మండలంలోని ప్రగడవరం గ్రామంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ తవ్వకం పనులను బుధవారం కూడా రైతులు అడ్డుకున్నారు. పథకంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పెంచే వరకు పనులను జరగనివ్వమని భీష్మించారు. కాలువ భూసేకరణ నిమిత్తం సర్వే సిబ్బంది వచ్చిన విషయం తెలుసుకున్న ప్రగడవర ం, వెలగలపల్లి గ్రామాలకు చెందిన రైతులు సంఘటనా స్థలానికి చేరుకుని టెంట్ వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం పరిహారం విషయం తేల్చే వరకూ సర్వే పనులు నిలిపివేయాలని గోలి రామకృష్ణారెడ్డి, ఎస్.రమేష్‌రెడ్డి, గంగవల్లి చంద్రశేఖర్ తదితరులు డిమాండ్ చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం భూసేకరణ తరహాలో తమకూ ఎకరాకు రూ.30 లక్షలు చెల్లించాలని మండలంలోని రైతులు మే నెల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. కొందరు రైతులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు సమాచారం ఇవ్వకుండా సర్వే పనులు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


