ఇక మేం మాట్లాడేదేం లేదు: రాజ్నాథ్ | nothing to say about cash for vote scam, says rajnath singh | Sakshi
Sakshi News home page

ఇక మేం మాట్లాడేదేం లేదు: రాజ్నాథ్

Jun 16 2015 5:49 PM | Updated on Jul 28 2018 6:48 PM

ఇక మేం మాట్లాడేదేం లేదు: రాజ్నాథ్ - Sakshi

ఇక మేం మాట్లాడేదేం లేదు: రాజ్నాథ్

ఓటుకు నోటు కేసులో తాము మాట్లాడేది ఇక ఏమీ లేదని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

ఓటుకు నోటు కేసులో తాము మాట్లాడేది ఇక ఏమీ లేదని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ కేసులో చంద్రబాబు పాత్ర మీద కచ్చితమైన ఆధారాలు లభ్యం కావడంతో ఆయనకు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ ఏసీబీ భావించడం, అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా తగిన ఆధారాలుంటే 'గో ఎహెడ్' అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న కథనాలు వచ్చిన నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అలాగే, హైదరాబాద్ నగరంలో సెక్షన్ 8 అమలుచేయాలంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ముఖ్యమంత్రి చేస్తున్న డిమాండ్ల మీద కూడా రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఈ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని కేంద్ర హోం శాఖ కార్యదర్శి పరిష్కరిస్తారని ఆయన చెప్పారు. తద్వారా ఈ వివాదం విషయంలో ఏ ఒక్క ప్రభుత్వానికి అనుకూలంగా తాము వ్యవహరించడం లేదన్నట్లుగా ఆయన చెప్పినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement