
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండల వాడి దర్శనానికి ప్రస్తుతం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) శ్రీవారిని 69,317 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.38 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు.