చివరి ట్రేడింగ్లో మార్కెట్లు అదుర్స్ | Nifty ends below 8200, Sensex climbs 260 pts; FMCG gains | Sakshi
Sakshi News home page

చివరి ట్రేడింగ్లో మార్కెట్లు అదుర్స్

Dec 30 2016 5:12 PM | Updated on Oct 2 2018 8:16 PM

ఎన్నో ఒడిదుడుకుల అనంతరం 2016 చివరి ట్రేడింగ్ సెషన్లో దేశీయ మార్కెట్లు అదరగొట్టాయి.

ఎన్నో ఒడిదుడుకుల అనంతరం 2016 చివరి ట్రేడింగ్ సెషన్లో దేశీయ మార్కెట్లు అదరగొట్టాయి. సెన్సెక్స్ 260.31 పాయింట్ల లాభంతో 26626.46 వద్ద , నిఫ్టీ 82.20 పాయింట్ల లాభంతో 8185.80 వద్ద  ముగిశాయి. బ్యాంకు నిఫ్టీ పుంజుకోవడంతోపాటు జనవరి నెల డెరివేటివ్ సిరీస్ నేటి నుంచి ప్రారంభం కావడంతో మార్కెట్లు లాభపడ్డాయని విశ్లేషకులు చెప్పారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం, అమెరికా ఎన్నికల్లో ట్రంప్ నెగ్గడం వంటి ఎన్నో ప్రపంచ అనూహ్య పరిణామాల నేపథ్యంలోనూ ఈ ఏడాదిలో నిఫ్టీ 3 శాతం, బీఎస్ఈ ఇండెక్స్ 2 శాతం లాభాలను ఆర్జించినట్టు తెలిపారు. 2016 లాభాలతో 2015 రికార్డు స్థాయి పతనాల నుంచి కోలుకున్నామని పేర్కొన్నారు.
 
ఎంతో ప్రతిష్టాత్మకమైన జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడం దేశీయ మార్కెట్లలో సెంటిమెంట్ను బలపర్చిందన్నారు. కానీ హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రభుత్వ ప్రకటన ఆర్థిక వృద్ధిపై  ఆందోళనలను నెలకొలుపుతుందన్నారు. కానీ ఫిబ్రవరిలో జరగబోయే మానిటరీ పాలసీ సమీక్షలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీరేట్లకు కోత పెడుతుందనే అంచనాలు కొత్త ఏడాదిలో అంచనాలను పెంచుతున్నాయన్నారు. ప్రస్తుతం మార్కెట్లు సౌకర్యవంతమైన జోన్లోనే ఉన్నాయని చెప్పారు. వచ్చే నెలల్లో వచ్చే బడ్జెట్పై మార్కెట్లు పాజిటివ్ సంకేతాల కోసం ఎదురుచూస్తున్నాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement