11 వేల వీడియో గేమ్స్.. గిన్నిస్ బుక్ రికార్డు! | New York man's 10,607 video games secure Guinness World Records title | Sakshi
Sakshi News home page

11 వేల వీడియో గేమ్స్.. గిన్నిస్ బుక్ రికార్డు!

Dec 24 2013 4:26 PM | Updated on Sep 2 2017 1:55 AM

మనలో ప్రతి ఒక్కరు తనకు నచ్చిన పనిని ఇష్టంగా చేస్తు ఉంటారు. క్రమ క్రమంగా ఆ పని ఓ హాబీ మారుతుండటం సహజం

మనలో ప్రతి ఒక్కరు తనకు నచ్చిన పనిని ఇష్టంగా చేస్తు ఉంటారు.  క్రమ క్రమంగా ఆ పని ఓ హాబీ మారుతుండటం సహజం. అలా ఓ హాబీగా ఎంచుకుని వీడియో గేమ్స్ సేకరించడం ప్రారంభించిన న్యూయార్క్ చెందిన ఓ వ్యక్తి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సుల్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే తన 12 ఏట క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మైఖెల్ థాంప్సన్ అనే వ్యక్తి కాస్మిక్ అవెంజర్ అనే వీడియో గేమ్ ను సేకరించాడు. అప్పటి నుంచి వీడియో గేమ్స్ ను అలా సేకరిస్తూనే 19 ఏళ్లు గడిపాడు. తన 31 ఏట ఓసారి వెనక్కి చూసుకుంటే సుమారు 11 వేలకు పైగా వీడియోగేమ్స్ ఆయన ఖాతాలో చేరాయి. దాంతో 2014 కోసం గేమర్ ఎడిషన్ కోసం విడుదల చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించారు. 
 
థాంప్సన వద్ద క్యాసెట్, వీహెచ్ఎస్, లేజర్ డిస్క్, కాట్రిడ్జ్ రూపంలో వీడియో గేమ్స్ ఉన్నాయి. వీడియో గేమ్స్ కలెక్షన్ తో బఫెలో నగరంలోని తన నివాసంలోని కింది పోర్షన్ అంతా నిండిపొయింది. పలు రకాల వెర్షన్ లో సేకరించిన వీడియో గేమ్స్ ప్లే చేయడానికి పలు రకాలైన ఎక్స్ బాక్సెస్, ప్లే స్టేషన్స్, కాసియో లూపీలాంటి పరికరాలును కొనుగోలు చేశారు. 
 
తన వద్ద ఉన్న ప్రతి వీడియో గేమ్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి అని థాంప్సన్ తెలిపారు. ఇప్పటి వరకు రెండు రోజులకు ఒకటి చొప్పున వీడియోలను సేకరించారు. ప్రతి సంవత్సరానికి 3 వేల యూఎస్ డాలర్ల చొప్పున వీడియో గేమ్స్ కొనుగోలుకు ఖర్చు చేశారు. ప్రస్తుతం తన వద్ద ఉన్న వీడియో గేమ్స్ విలువ సుమారు 8 లక్షల డాలర్లు ఉంటుందని థాంప్సన్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement