కేరళలో హవాలా రాకెట్ గుట్టు రట్టు | Nearly Rs. 40 Lakhs In Rs. 2,000 Notes Seized In Kerala, 1 Arrested | Sakshi
Sakshi News home page

కేరళలో హవాలా రాకెట్ గుట్టు రట్టు

Dec 24 2016 4:39 PM | Updated on Sep 4 2017 11:31 PM

కేరళలో హవాలా రాకెట్ గుట్టు రట్టు

కేరళలో హవాలా రాకెట్ గుట్టు రట్టు

కేరళలోమరో హవాలా రాకెట్ ను ఛేదించిన పోలీసులు భారీ ఎత్తున కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.39.98లక్షల విలువజేసే రూ.2వేల నోట్లను సీజ్ చేశారు.

మలప్పురం:  ఒకవైపు రద్దయిన నోట్ల డిపాజిట్లకు గడువు దగ్గర పడుతోంది. మరోవైపు నగదు మార్పిడిలో అక్రమార్కుల జోరు పెరిగింది. రద్దయిన పాతనోట్లుసహా కొత్త నోట్లు కూడా కోట్ల కొద్దీ పట్టుపడుతుండటం ఐటీ వర్గాలను సైతం కలవరపరువస్తోంది.  ఈనేపథ్యంలో  తాజాగా కేరళలోమరో హవాలా రాకెట్ ను  ఛేదించిన  పోలీసులు భారీ ఎత్తున కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.39.98లక్షల విలువజేసే  రూ.2వేల నోట్లను  సీజ్ చేశారు. భారీ ఎత్తున నగదు మార్పిడికి పాల్పడుతున్నాడనే ఆరోపణలతో సోదాలు నిర్వంచగా ఈ నగదు పట్టుబడింది.
ప్పటికే హవాలా కేసు ఎదుర్కొంటున్న  స్థానిక వ్యాపారి షాబీర్ బాబు  నుంచి వీటిని  స్వాధీనం చేసుకున్నారు.  మలప్పురం జిల్లాలో తిరురూ ప్రాంతంలో  అక్రమాలకు పాల్పతుండగా ఈ నగదునుస్వాధీనం చేసుకున్నారు.  షాబీర్ పాత రూ.500,1000నోట్ల మార్పిడిలో భాగంగా రూ.3 లక్షల కొత్త నోట్లను  షాకత్ అలీకి (63)ఇచ్చిన కేసు విచారణలో  రాకెట్ వెలుగు చూసింది.  దీంతోపాటుగా అలీతో సహా మరో తొమ్మిదిమందికి  కొత్త కరెన్సీ నోట్లను పంపిణీచేసినట్టు తెలిపారు.  దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు.
కాగా తిరూర్  బస్సు స్టాండ్ వద్ద  షౌకత్  ఆలీ  రూ.3 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పాలక్కాడ్ జిల్లాకు చెందిన   ఆలీని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చారు.అనంతరం జ్యుడీషియల్  రిమాండ్ కు  తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement