'ఓయూ విద్యార్థులతో పెట్టుకుంటే కేసీఆర్ దగ్ధమవుతాడు' | Nagam Janardhan reddy takes on kcr | Sakshi
Sakshi News home page

'ఓయూ విద్యార్థులతో పెట్టుకుంటే కేసీఆర్ దగ్ధమవుతాడు'

May 20 2015 12:47 PM | Updated on Mar 29 2019 9:07 PM

'ఓయూ విద్యార్థులతో పెట్టుకుంటే కేసీఆర్ దగ్ధమవుతాడు' - Sakshi

'ఓయూ విద్యార్థులతో పెట్టుకుంటే కేసీఆర్ దగ్ధమవుతాడు'

ఉస్మానియా విద్యార్థుల పోరాటాలు.. త్యాగాల ఫలితంగానే తెలంగాణ సీఎం కుర్చీ కేసీఆర్కి దక్కిందని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు.

మహబూబ్నగర్: ఉస్మానియా విద్యార్థుల పోరాటాలు.. త్యాగాల ఫలితంగానే తెలంగాణ సీఎం కుర్చీ కేసీఆర్కి దక్కిందని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. బుధవారం మహబూబ్నగర్లో నాగం మాట్లాడుతూ... యూనివర్శిటీ విద్యార్థులను కేసీఆర్ బచ్చాగాళ్లనడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

యూనిర్శిటీ విద్యార్థులతో పెట్టుకుంటే కేసీఆర్ దగ్ధమవుతాడని ఆయన హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) అంటే పోరాటాల గడ్డ అని నేత నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. 1969 నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన పోరాటంలో ఉస్మానియా యూనివర్శిటీ తెలంగాణ పురిటి గడ్డ మారిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన విశదీకరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement