'కేసీఆర్ క్రిమినల్ మైండ్ ముఖ్యమంత్రి' | N Chinna rajappa takes on Telangana CM KCR | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ క్రిమినల్ మైండ్ ముఖ్యమంత్రి'

Jun 2 2015 12:13 PM | Updated on Mar 28 2019 5:30 PM

'కేసీఆర్ క్రిమినల్ మైండ్ ముఖ్యమంత్రి' - Sakshi

'కేసీఆర్ క్రిమినల్ మైండ్ ముఖ్యమంత్రి'

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎన్ చినరాజప్ప మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మండిపడ్డారు.

కాకినాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎన్ చినరాజప్ప మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మండిపడ్డారు. కేసీఆర్ క్రిమినల్ మైండ్ ముఖ్యమంత్రి అని ఆయన అభివర్ణించారు. టీఆర్ఎస్ సర్కార్ కావాలనే రేవంత్ను ట్రాప్ చేసి ఇరికించిందని ఆరోపించారు. రేవంత్రెడ్డి విషయంలో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని చినరాజప్ప స్పష్టం చేశారు.

గతేడాది జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో మంగళవారం కాకినాడలో నవ నిర్మాణ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో ఎన్. చినరాజప్ప పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు అంశంలో చంద్రబాబు పాత్ర ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు... ఈ నేపథ్యంలో  రేవంత్రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధం లేదని చినరాజప్ప వెల్లడించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement