జియో యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ | Mukesh Ambani announces Jio Prime offer at one-time fee of Rs 99 | Sakshi
Sakshi News home page

జియో యూజర్లకు బంపర్‌ ఆఫర్‌

Feb 21 2017 2:43 PM | Updated on Sep 5 2017 4:16 AM

జియో యూజర్లకు బంపర్‌ ఆఫర్‌

జియో యూజర్లకు బంపర్‌ ఆఫర్‌

ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో రిలయన్స్‌ అధినేత ముకేష​ అంబానీ జియో వినియోగదారులకు మరిన్ని ఆఫర్లను ప్రకటించారు.

ఉచిత డేటా, ఉచిత వాయిస్‌ కాలింగ్‌ అంటూ దూసుకొచ్చిన రిలయన్స్‌ జియో మరో  సంచలన ఆఫర్‌తో వినియోగదారులను ఊరిస్తోంది. మంగళవారం ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో రిలయన్స్‌ అధినేత ముకేష్ అంబానీ జియో వినియోగదారులకు మరిన్ని ఆఫర్లను ప్రకటించారు. రికార్డు స్థాయి ఖాతాదారులను నమోదు చేసిన వినియోగదారులకు ఈ సందర్భంగా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. జియో రాకతో జియో యూజర్ల జీవితాలు డిజిటల్‌గా అందంగా మారిపోయాయని  అంబానీ అభివర్ణించారు.
 
 
మార్చి 1తో ముగియనున్న హేపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ ముగియనున్న నేపథ్యంలో మరో ఆఫర్‌ను ప్రకటించారు. ఒకవైపు ఎయిర్‌ టెల్‌, ఐడియా లాంటి ప్రత్యర్థుల అభ్యంతరాలు కొనసాగుతుండగానే జియో ఇన్ఫోకాం మరిన్ని ఆఫర్లను అందించనుంది.  
 
ముఖ‍్యంగా 100 మిలియన్ కస్టమర్ల మైలురాయిని దాటేసిన జియో​కు చాలా తక్కువగా రీచార్జ్‌ల టారిఫ్‌లను అంబానీ ప్రకటించారు. రూ. 99 రుసుముతో జియో ప్రధాన సభ్యత్వం (ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌) కార్యమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. జియో వినియోగదారుల కోసం మార్చి 1న దీన్ని లాంచ్‌ చేస్తామన్నారు.  మార్చి 31 వరకు ఈ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చని చెప్పారు. 2018 మార్చి వరకూ  రూ. 99 రీచార్జ్‌తో ఈ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చు. దీంతో పాటు అన్‌ లిమిటెడ్‌ సేవలను అందించనున్నట్టు ప్రకటించారు. ఈ నమోదు ద్వారా ప్రైమ్‌  వినియోగదారులు మరో ఏడాది పాటు ఉచిత సేవలను పొందవచ్చు.  అలాగే ఈ సభ్యత్వం తీసుకుని ఉచిత వాయిస్‌ కాల్స్ ‌(రోమింగ్‌ సహా) మార్చి 2018 వరకు అనుభవించవచ్చు. జియో ప్రధాన సభ్యులుగా చేరేవారు కేవలం (రోజుకు రూ.10) నెలకు రూ. 303 పరిచయ ధరతో ఈ  సేవలను పొందవచ్చని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని ముకేష్‌ అంబానీ మరోసారి పునరుద్ఘాటించారు.
 
సంబంధిత వార్తలు..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement