బాలికపై గ్యాంగ్రేప్.. ఆరుగురి అరెస్టు | Minor girl gangraped in Mumbai, 6 detained | Sakshi
Sakshi News home page

బాలికపై గ్యాంగ్రేప్.. ఆరుగురి అరెస్టు

Aug 5 2015 3:14 PM | Updated on Sep 3 2017 6:50 AM

బాలికపై గ్యాంగ్రేప్.. ఆరుగురి అరెస్టు

బాలికపై గ్యాంగ్రేప్.. ఆరుగురి అరెస్టు

ఓ బాలికపై కొందరు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఓ బాలికపై కొందరు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ముంబై శివార్లలోని చెంబూరు ప్రాంతంలోగల ఓ హౌసింగ్ సొసైటీలో తెల్లవారుజామున జరిగింది. ఈ కేసులో ఇప్పటికి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల్లో ఒకరు బాలికకు తెలిసున్నవాళ్లే. సామూహిక అత్యాచారం జరిగిన భవన కేర్టేకర్ కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం కూడా గాలింపు చర్యలు సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికను ఘట్కోపర్ ప్రాంతంలోని రాజావాడి ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement