మింగిన నిధులను కక్కిస్తాం | Minister HarishRao fires on officers! | Sakshi
Sakshi News home page

మింగిన నిధులను కక్కిస్తాం

Dec 18 2015 4:09 AM | Updated on Sep 17 2018 8:02 PM

గతంలో చెరువుల నిధులు స్వాహా చేసిన వారి చిట్టా తమ వద్ద ఉందని, లెక్కలతో సహా కక్కిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.

చిట్టా బయట పెడతాం: హరీశ్‌రావు
కల్హేర్: గతంలో చెరువుల నిధులు స్వాహా చేసిన వారి చిట్టా తమ వద్ద ఉందని, లెక్కలతో సహా కక్కిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా కల్హేర్ మండలం ఫత్తెపూర్ శివారులో గురువారం జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.పనులు చేయకుండా నిధులు ఎంతమేర మింగింది చెబుతామని, వారి చరిత్ర త్వరలో బయటపెడ్తామని చెప్పారు. తమ ప్రభుత్వం అవినీతి రహితం గా, పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు.

మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కాంగ్రెస్ నేతలు శివరాజు పాటిల్‌ను బక్రా చేయాలని చూశారని, ఆయన తెలివితో వ్యవహరించి కాంగ్రెస్ నేతలనే బక్రా చేశారని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్, టీడీపీ నేతలు జీర్ణించుకోవడం లేదన్నారు. అంతకు ముందు మంత్రి ఫత్తెపూర్ చౌరస్తాలో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.  
 
టీడీపీకి ఓట్లేస్తే మురికి కాల్వలో వేసినట్లే
నారాయణఖేడ్: టీడీపీకి ఓట్లేస్తే మురికి కాల్వ లో వేసినట్లేనని మంత్రి టి.హరీశ్‌రావు అన్నా రు. మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో గురువా రం ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చం ద్రబాబు విజయవాడకు వెళ్లిపోయారని, ఇక ఆ పార్టీకి ఓట్లువేయడం అవసరమా అని ప్రశ్నిం చారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఆ పార్టీలో ఉండలేక టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement