మైక్రోసాఫ్ట్లో ఉద్యోగాల కోత | Microsoft Confirms Mobile Unit Closure, 1,350 Job Cuts in Finland | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్లో ఉద్యోగాల కోత

Jul 12 2016 11:26 AM | Updated on Sep 4 2017 4:42 AM

మైక్రోసాఫ్ట్లో ఉద్యోగాల కోత

మైక్రోసాఫ్ట్లో ఉద్యోగాల కోత

ఫిన్నిస్ మొబైల్ ఫోన్ యూనిట్ ను మూసేస్తున్నట్టు అమెరికా సాప్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాప్ట్ ధృవీకరించింది

హెల్సింకీ : ఫిన్నిస్ మొబైల్ ఫోన్ యూనిట్ ను మూసేస్తున్నట్టు అమెరికా సాప్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాప్ట్ ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఫిన్ లాండ్ లో 1,350 ఉద్యోగాలకు కోత పెట్టనున్నట్టు సోమవారం ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ల వ్యాపారాన్ని క్రమబద్ధీకరణ భాగంలో 1,850 ఉద్యోగులను తొలగించే ప్లాన్ ను మైక్రోసాప్ట్ గత మేలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఫిన్‌లాండ్‌లోని ఈ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ యూనిట్‌ను మూసేస్తున్నామని ప్రకటించింది. ఎక్కువ ఉద్యోగాల కోతలు ఫిన్ లాండ్ లో ఉంటాయని అప్పుడే తెలిపింది. ఈ విషయాన్ని సోమవారం ధృవీకరించింది.

ఆపదలో ఉన్న హ్యాండ్ సెట్ల తయారీ సంస్థ నోకియాను కొనుగోలు చేయడం ద్వారా మైక్రోసాప్ట్, ఫోన్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఈ కొనుగోలు అనంతరం 54వేల జనాభా ఉన్న దక్షిణ ఫిన్ లాండ్ లోని సాలో పట్టణ నివాసులకు ఉద్యోగవకాశాలు మెరుగుపర్చింది. పదేళ్ల క్రితం వరకు నోకియా ఆపరేషన్స్ లో సాలో ఉద్యోగులు ఐదు వేల మంది ఉన్నారు. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీలోనే వారు ఎక్కువగా ఉద్యోగాలు పొందుతున్నారు. కానీ మైక్రోసాప్ట్ నిర్ణయంతో వారి ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరయ్యాయి.

ఆ పట్టణంలో ఉన్న నోకియా ప్రొడక్ట్ డెవలప్ మెంట్ యూనిట్ మూసివేస్తున్నామనే ప్రకటనతో తమ ఉద్యోగాలు రిస్క్ లో పడబోతున్నాయనే ఆందోళనలను వ్యక్తంచేస్తున్నారు. గతేడాది కూడా ఈ యూఎస్ దిగ్గజం సాలో పట్టణ నివాసులను ఎక్కువ ఉద్యోగాల్లో చేర్చుకుంటామని ప్రకటించింది. కానీ ఫోన్ల బిజినెస్ లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఫిన్ లాండ్ రీసెర్చ్ డెవలప్ మెంట్ యూనిట్ ను మూసివేసి 1,350 ఉద్యోగులకు ఉపశమనం పలకాలని మైక్రోసాప్ట్ నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement