చదవలేకపోతున్నానని.. మెడికో ఆత్మహత్య | Medico Suicide | Sakshi
Sakshi News home page

చదవలేకపోతున్నానని.. మెడికో ఆత్మహత్య

Aug 25 2017 12:51 AM | Updated on Oct 9 2018 7:43 PM

చదవలేకపోతున్నానని.. మెడికో ఆత్మహత్య - Sakshi

చదవలేకపోతున్నానని.. మెడికో ఆత్మహత్య

‘నన్ను క్షమించండి.. నేను చదవలేకపోతున్నా.. మీరు కోరుకున్నట్లు నేను డాక్టర్‌ను కాలేనేమో’ అని సూసైడ్‌ నోట్‌ రాసి వైద్య విద్యార్థి గుగులోత్‌ మనోకృష్ణ (20)

ఏపీలోని ఒంగోలు రిమ్స్‌ విద్యార్థి
- ఇంటికి వచ్చి బలవన్మరణం
- మృతుడి వద్ద సూసైడ్‌నోట్‌


మరిపెడ (డోర్నకల్‌): ‘నన్ను క్షమించండి.. నేను చదవలేకపోతున్నా.. మీరు కోరుకున్నట్లు నేను డాక్టర్‌ను కాలేనేమో’ అని సూసైడ్‌ నోట్‌ రాసి వైద్య విద్యార్థి గుగులోత్‌ మనోకృష్ణ (20) గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలానికి చెందిన గుగులోతు నామ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, భార్య శోభ ఎంపీటీసీ సభ్యురాలు. వీరికి ఇద్దరు కుమారులుండగా, ఇద్దరినీ ఎంబీబీఎస్‌ చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు మనోజ్‌ నల్లగొండ జిల్లా లోని నార్కట్‌పల్లి వద్ద ఉన్న కామినేని ఆస్పత్రిలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు.

చిన్న కుమారుడు మనోకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు రిమ్స్‌ ప్రభు త్వ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతు న్నాడు. ప్రథమ సంవత్సరంలో కళాశాలలోనే 75 శాతం మార్కులతో 9వ ర్యాంక్‌ సాధించాడు.  మనోకృష్ణ శనివారం ఇంటికి వచ్చాడు. అక్కడ ఏమైనా ఇబ్బందులున్నాయా? అని తండ్రి ప్రశ్నించగా.. అలాంటిదేం లేదన్నాడు. మనోకృష్ణ గురువారం సినిమా చూసి ఇంటికి వచ్చాడు.  ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనో కృష్ణ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. తండ్రి ఇంటికి వచ్చి తలుపులు తెరవగా కొడుకు శవమై కనిపిం చాడు. భార్యకు చెప్పగా మండల సభ నుంచి కన్నీరుమున్నీరవుతూ ఇంటికి వచ్చారు. డీఎస్‌ రెడ్యానాయక్, మహబూబాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్‌ గుడిపుడి నవీన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అన్నా.. అన్నీ నీవే..
మనోకృష్ణ సూసైడ్‌ నోట్‌ రాసి, బెడ్‌పై పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌ నోట్‌లో ఉన్న వివరాలను సీఐ శ్రీనివాస్‌ వివరించారు. ‘అన్నా.. మీ అందరినీ వదిలి వెళ్లాలని లేదు. కానీ, చదువుకోవడంలో నాకు నిర్లక్ష్యం ఉంది. నేను అనుకున్న ప్రకారం డాక్టర్‌ను కానేమో అనే అనుమానం తలెత్తింది. దీంతో చాలా రోజులుగా  నరకయాతన అనుభవించాను. చివరకు తప్పని సరి ఇక భూమిమీద ఉండొద్దనే ఆలోచనకు వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నా. ఇది తప్పే అని తెలిసి కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నా. ఇక అన్నీ నీవే.. అమ్మనాన్నలను జాగ్రత్తగా చూసుకో.. నాకు సాయి, వంశీ, రాజీ, సతీశ్, గోపీ, వసంత ఆంటీ కుటుంబసభ్యులుగా సహకరించారు. నేను ఎక్కడున్నా మీ హృదయాల్లో నిలిచి ఉంటాను. మిమ్మల్ని వదిలి తీసుకున్న ఈ నిర్ణయానికి నన్ను క్షమించాలని కోరుకుంటున్నా’ అని రాశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement