సినీనటిపై గ్యాంగ్ రేప్.. ఒకరి అరెస్టు | marathi actress gang raped, one arrested | Sakshi
Sakshi News home page

సినీనటిపై గ్యాంగ్ రేప్.. ఒకరి అరెస్టు

Jul 14 2015 7:09 PM | Updated on Sep 3 2017 5:29 AM

సినీనటిపై గ్యాంగ్ రేప్.. ఒకరి అరెస్టు

సినీనటిపై గ్యాంగ్ రేప్.. ఒకరి అరెస్టు

మహిళలపై నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్ ప్రాంతంలో ఓ మరాఠీ సినీ నటిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.

మహిళలపై నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్ ప్రాంతంలో ఓ మరాఠీ సినీ నటిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. వారిలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబై శివారు ప్రాంతానికి చెందిన ఈ నటి సినిమా షూటింగ్ కోసం పైఠాన్ జిల్లాకు వెళ్లింది. రెండు నెలల పాటు అక్కడే ఉన్న ఆమె.. ఆదివారం నాడు తన డబ్బు తీసుకోడానికి ఔరంగాబాద్కు వచ్చింది. దర్శకుడి స్నేహితుడి వద్దకు తన పారితోషికం కోసం వెళ్లగా, అతడు ఆమెను అక్కడి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పైఠాన్ వద్దకు తీసుకెళ్లి, అక్కడ మరో నలుగురితో కలిసి సామూహిక అత్యాచారం చేశారని ఔరంగాబాద్ క్రైం బ్రాంచి ఇన్స్పెక్టర్ కంచన్ కుమార్ చెప్పారు.

ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆనంద్ మఘాడే అనే డైరెక్టర్ తన స్నేహితుడైన గోవింద్ చిట్లాంగేకు.. సినిమా కోసం ఓ హీరోయిన్ కావాలని  చెప్పాడు. దాంతో ముంబైకి చెందిన ఆ అమ్మాయిని ఎంపిక చేసి, రెండు నెలల పాటు షూటింగ్ చేశారు. అయితే ఆమెకు డబ్బులు మాత్రం ఇవ్వలేదు. తన డబ్బుల గురించి గోవింద్ చిట్లాంగేను సంప్రదించగా, అతడు ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ మరో నలుగురితో కలిసి సామూహిక అత్యాచారం చేసినట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. చిట్లాంగేను ఇప్పటికే అరెస్టు చేయగా.. మిగిలిన నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement