జీన్స్ వేసుకుందని భార్యను చంపేశాడు | Man kills wife for wearing jeans and T-shirt | Sakshi
Sakshi News home page

జీన్స్ వేసుకుందని భార్యను చంపేశాడు

Nov 1 2015 9:08 AM | Updated on Aug 11 2018 8:48 PM

జీన్స్ వేసుకుందని భార్యను చంపేశాడు - Sakshi

జీన్స్ వేసుకుందని భార్యను చంపేశాడు

ఆధునికతకు అనుగుణంగా జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ ధరించడమే ఆమె నేరమైంది.

పుణె: ఆధునికతకు అనుగుణంగా జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ ధరించడమే ఆమె చేసిన నేరమైంది. సంప్రదాయ విరుద్ధంగా దుస్తులు వేసుకుందని ఆమెను కట్టుకున్న భర్తే కడతేర్చాడు. పుణెలోని గుల్తెకేడి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ ధరిస్తున్న విషయమై భార్య పూజ(21)తో రంజీత్ నిషాద్ (24) గొడవ పడేవాడు. ఒక రోజు ఇదే విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రంజీత్ పూజపై దాడి చేసి చంపేశాడు. ఆమె మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి పరారయ్యాడు. గత శుక్రవారం ఇంటిలోని మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement