వృద్ధుడిని తొక్కి చంపిన ఏనుగులు | Man killed by elephants in Bengal | Sakshi
Sakshi News home page

వృద్ధుడిని తొక్కి చంపిన ఏనుగులు

May 11 2015 6:28 PM | Updated on Sep 3 2017 1:51 AM

వృద్ధుడిని తొక్కి చంపిన ఏనుగులు

వృద్ధుడిని తొక్కి చంపిన ఏనుగులు

ఏనుగులు వృద్ధుడిని తొక్కి చంపిన ఘటన పశ్చిమబెంగాల్ లోని బాంకురా జిల్లా గోకుల్ మాథురా గ్రామంలో జరిగింది.

కోల్ కతా: ఏనుగులు వృద్ధుడిని తొక్కి చంపిన ఘటన పశ్చిమబెంగాల్ లోని బాంకురా జిల్లా గోకుల్ మాథురా గ్రామంలో జరిగింది. అటవీ ప్రాంతానికి సమీపంలో వెదురు పొద కింద నిద్రిస్తున్న బిశ్వనాథ్ సొరేన్(65) పై 11 ఏనుగులు దాడి చేసి తొక్కి చంపాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. బాజ్రోరా ఫారెస్ట్ రేంజ్ లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇదే జిల్లాలో పాంచెట్ అటవీ ప్రాంతంలో గతనెలలో ఫారెస్ట్ గార్డ్ పై ఏనుగులు దాడి చేసి చంపాయి. జాల్ పాయ్ గురి జిల్లాలో ఆదివారం జరిగిన మరొక ఘటనలో ఏనుగు దాడిలో అటవీశాఖ అధికారికి గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement