రేపిస్టుకు 20 ఏళ్ల జైలు | Man jailed for 20 years for raping four year old | Sakshi
Sakshi News home page

రేపిస్టుకు 20 ఏళ్ల జైలు

Aug 5 2014 10:48 PM | Updated on Jul 28 2018 8:35 PM

నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడొకరికి పశ్చిమబెంగాల్ లోని స్థానిక న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

సూరి: నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడొకరికి పశ్చిమబెంగాల్ లోని స్థానిక న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నందన్ సాహా గతేడాది ఆగస్టు 6న బిర్భుం జిల్లా నానూర్ లోని కిర్నార్హర్ గ్రామంలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలికను ఎత్తుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో దోషిగా తేలడంతో అతడికి అడిషినల్ సెషన్స్ జడ్జి మహానంద దాస్ 20 ఏళ్ల జైలుశిక్ష విధించారు. రూ.20వేలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement