ప్రపంచంలోనే ‘అరుదైన’ క్రికెట్‌ మ్యాచ్‌ | Maasai warriors cricket match with british army | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే ‘అరుదైన’ క్రికెట్‌ మ్యాచ్‌

Jun 19 2017 8:42 PM | Updated on Sep 5 2017 1:59 PM

ప్రపంచంలోనే అరుదైన క్రికెట్‌ మ్యాచ్‌ కెన్యా అడవుల్లో జరిగింది.



నైరోబి:
క్రికెట్‌ పూర్తిగా కమర్షియలైజైన తరుణాన ‘ఫ్రెండ్లీ మ్యాచ్’ అన్న మాటే వాడుకలో లేకుండాపోయింది! అయితే కొందరు జంటిల్మన్లు మాత్రం.. కాసుల కోసమో, కిక్కు కోసమో కాకుండా సదుద్దేశంతో  ‘జెంటిల్మన్‌ గేమ్‌’  ఆడి ‘ఔరా’  అనిపించారు.

దక్షిణ కెన్యాలో నివసించే మస్సాయ్‌ గిరిజనులు, బ్రిటిష్‌ ఆర్మీకి మధ్య.. పచ్చటి బయళ్లలో ఆసక్తికరంగా సాగిన రెండురోజుల క్రికెట్‌ మ్యాచ్‌.. క్రీడా, జంతుప్రేమికులను ఆకట్టుకుంది. ప్రపంచంలోని ఏకైక మగ తెల్ల ఖడ్గమృగాన్ని(నార్తర్న్‌ వైట్‌ రైనో) కాపాడుకోవడానికి వీళ్లిలా క్రికెట్‌ను సాధనంగా ఎంచుకున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తద్వారా లభించే ప్రచారంతో ‘అరుదైన మృగాన్ని కాపాడాల’నే సందేశం ప్రజల్లోకి బలంగా వెళుతుందని వీరి ఆశ.

ఖడ్గమృగం కోసం కమాండోల కాపలా: ఈ ఫొటోల్లో క్రీడాకారులతో కనిపిస్తోన్న తెల్ల ఖడ్గమృగం.. భూమ్మీద జీవించి ఉన్న ఏకైక జీవి. వేటగాళ్లబారిన పడి మిగతావన్నీ చనిపోగా.. మిగిలిన ఏకైక మగ ఖడ్గమృగమిది. అందుకే కెన్యా ప్రభుత్వం దీనిని అత్యంత జాగ్రత్తగా చూసుకుంటోంది. ఖడ్గమృగ రక్షణ కోసం ప్రత్యేకంగా కమాండోలను కూడా ఏర్పాటు చేసింది. గడ్డి మేయడానికి వెళ్లినా, పచ్చిక బయల్లో అటూ ఇటూ తిరగడానికి వెళ్లినా దాని వెంట కమాండోలు ఉండాల్సిందే. 24 గంటలు దీన్ని కాపలా కాస్తూ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు.















Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement