ఎట్రాక్టివ్ ఆఫర్లతో లెనోవో జెడ్ 2 విడుదల | Lenovo Z2 smartphone launched at Rs 17,999 on Amazon India | Sakshi
Sakshi News home page

ఎట్రాక్టివ్ ఆఫర్లతో లెనోవో జెడ్ 2 విడుదల

Sep 26 2016 3:35 PM | Updated on Sep 4 2017 3:05 PM

ఎట్రాక్టివ్ ఆఫర్లతో  లెనోవో జెడ్ 2 విడుదల

ఎట్రాక్టివ్ ఆఫర్లతో లెనోవో జెడ్ 2 విడుదల

ప్రముఖ మొబైల్ సంస్థ లెనోవో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను సోమవారం లాంచ్ చేసింది. రెండు వేరియంట్లలో 'లెనోవో జెడ్ 2' వస్తున్న ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ను అమెజాన్ ద్వారా భారత మార్కెట్ లోకి అందుబాటులోకి తెచ్చింది.

ప్రముఖ మొబైల్ సంస్థ లెనోవో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను సోమవారం లాంచ్ చేసింది.  రెండు వేరియంట్లలో  'లెనోవో జెడ్ 2' వస్తున్న ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ను అమెజాన్ ద్వారా  భారత మార్కెట్ లోకి   అందుబాటులోకి తెచ్చింది.. 32 జీబీ  వేరియంట్ ను రూ.17,999, 64 జీబీ వేరియంట్ ను రూ. 19,999గా కంపెనీ నిర్ణయించింది.  అంతేకాదు దీనితో పాటు  కస్టమర్లకోసం  కొన్ని ఎట్రాక్టివ్ ఆఫర్లను కూడా అందిస్తోంది.
లెనోవా జెడ్ 2 ఫీచర్స్
5 ఇంచెస్ స్క్రీన్, 1920 x 1080 పిక్సెల్ రిజల్యూషన్
క్వాల్కం స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్
13 ఎంపీ   ప్రైమ్ కెమెరా,విత్ హైబ్రిడ్ ఆటో ఫోకస్  
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
4జీ, 3జీబీ ర్యామ్,  
32 ఇంటర్నెల్ మొమరీ
3500 ఎంఏహెచ్  హై డెన్సిటీ లియాన్ బ్యాటరీ
ఆఫర్లు
సెప్టెంబర్ 26-27 మధ్య కొంటే  100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కు అర్హులు.15మంది కస్టమర్లకు  అమెజార్ గిప్ట్ కార్డు ఆఫర్ కింద ఈ అవకాశం లభించనుంది. సెప్టెంబర్ 26 -అక్టోబర్ 3 మధ్య కొంటే యాత్రా. కాం లో 15 వేల  రూపాయల  ప్రోమో కోడ్ లభిస్తుంది. దీన్ని నవంబర్ 30లోగా   వినియోగించుకోవాల్సి ఉంటుంది.  అలాగే హెడీఎఫ్ సీ డెబిట్ కార్డ్ మీద 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. దీంతోపాటు కిండ్లే యాప్ ద్వారా కొనుగోలు చేస్తే ఈ బుక్స్ కొనుగోళ్లపై 80 శాతం తగ్గింపు, సెప్టెంబర్ 26 -అక్టోబర్ 3 మధ్య ఈ  స్మార్ట్ ఫోన్ కొనుగోలపై  రూ.500 ప్రత్యేక తగ్గింపు ఆఫర్  అందిస్తోంది. అయితే ఈ ఆఫర్లను అందుకోవాలంటే అమెజాన్.ఇన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement