లెనోవా కొత్త ఫోన్ రేటెంతంటే...
													 
										
					
					
					
																							
											
						 లెనోవా గతేడాది చైనాలో ఆవిష్కరించిన జుక్ జెడ్2కు రీబ్రాండెడ్ వెర్షన్గా ఓ కొత్త స్మార్ట్ఫోన్ను గురువారం భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది.
						 
										
					
					
																
	లెనోవా గతేడాది చైనాలో ఆవిష్కరించిన జుక్ జెడ్2కు రీబ్రాండెడ్ వెర్షన్గా ఓ కొత్త స్మార్ట్ఫోన్ను గురువారం భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. జెడ్2 ప్లస్ పేరుతో ఈ ఫోన్ను కంపెనీ భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ను తీసుకొచ్చింది. 3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా.. 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకంగా అమెజాన్ ఇండియా ఫ్లాట్ఫామ్పై ఈ ఆదివారం అర్థరాత్రి నుంచి అందుబాటులో ఉండనుంది. నలుపు, తెలుపు రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది.    
	 
	లెనోవా జెడ్2 ప్లస్ ఫీచర్స్...
	5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే
	ఆండ్రాయిడ్ 6.0.1 ఓఎస్
	క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్
	1080x1920 పిక్సెల్స్ రెజుల్యూషన్
	13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
	8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
	3జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నెల్ మెమెరీ
	4జీబీ ర్యామ్/ 64జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్
	విస్తరణ మెమరీకి అవకాశం లేదు
	డ్యుయల్ నానో-సిమ్ స్లాట్స్(3జీ, 4జీ సపోర్టు)
	3500 ఎంఏహెచ్ బ్యాటరీ
	ఫింగర్ప్రింట్ స్కానర్