వైభవంగా ‘రంగం’ ముగిసిన లష్కర్ బోనాలు | Laskhar bonalu is end with rangam programme at Secunderabad | Sakshi
Sakshi News home page

వైభవంగా ‘రంగం’ ముగిసిన లష్కర్ బోనాలు

Aug 4 2015 1:35 AM | Updated on Aug 14 2018 3:26 PM

వైభవంగా ‘రంగం’ ముగిసిన లష్కర్ బోనాలు - Sakshi

వైభవంగా ‘రంగం’ ముగిసిన లష్కర్ బోనాలు

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర ‘రంగం’తో వైభవంగా ముగిసింది.

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర ‘రంగం’తో వైభవంగా ముగిసింది. బోనాల లో భాగంగా రెండో రోజైన సోమవారం రంగం కార్యక్రమంలో భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. రంగంలో ప్రధాన ఘట్టమైన భవిష్యవాణిలో అమ్మవారు ఏం చెబుతారోనని భక్తులు ఆసక్తిగా ఎదురుచూశారు. పోతురాజుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కన్నుల పండువగా సాగాయి. ఆదివారం తెల్లవారుజామున మొదలైన అమ్మవారి దర్శనం సోమవారం ఉదయం వరకు కొనసాగింది.
 
 స్వార్థం పెరిగిపోయింది: భవిష్యవాణిలో అమ్మవారు  దేవాలయంలోని గర్భగుడికి ఎదురుగా ఉన్న మాతాంగేశ్వరి అమ్మవారి ఆలయం ముందు స్వర్ణలత పచ్చికుండపై నిల్చొని అమ్మవారు ఆవహించగా భవిష్యవాణిని వినిపిం చింది. ‘నా గురించి పట్టించుకోవడం లేదు.. ప్రజల్లో స్వా ర్థం పెరిగిపోయింది.. దోపిడీ పెరిగిపోయింది.. భయం లేకుండా పోయింది.. నా ప్రజలను నేనే చల్లంగ చూసుకుంటా.. వర్షాలు కురిపిస్తా.. కరువు కాటకాలు రాకుండా చూస్తా..  శిక్షించేదాన్ని నేనే.. ఆశీర్వదించి కష్టాలు తీర్చేదాన్ని నేనే..’ అంటూ బోనాల జాతర కీలక ఘట్టమైన రంగంలో స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement