కేవీపీ, టీస్సార్, ఎంఏఖాన్ నామినేషన్లు | KVP ramachandra rao, ma khan, tsr files nomination papers rajya sabha poll | Sakshi
Sakshi News home page

కేవీపీ, టీస్సార్, ఎంఏఖాన్ నామినేషన్లు

Jan 28 2014 2:45 PM | Updated on Mar 18 2019 9:02 PM

కేవీపీ, టీస్సార్, ఎంఏఖాన్ నామినేషన్లు - Sakshi

కేవీపీ, టీస్సార్, ఎంఏఖాన్ నామినేషన్లు

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులుగా కేవీపీ రామచంద్రరావు, టీ.సుబ్బరామిరెడ్డి, ఎంఏఖాన్ మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు.

హైదరాబాద్ : కాంగ్రెస్  రాజ్యసభ సభ్యులుగా కేవీపీ రామచంద్రరావు, టీ.సుబ్బరామిరెడ్డి, ఎంఏఖాన్ మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. కేవీపీ నామినేషన్పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీపీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ సంతకాలు చేశారు.  రాజ్యసభ నామినేషన్లకు మంగళవారం తుదిగడువు కావడంతో, రాష్ట్రం నుంచి జరగనున్న ఆరు రాజ్యసభ సీట్లకు నామినేషన్లు దాఖలు కానున్నాయి.

కాంగ్రెస్ నుంచి తిరుగుబాటు అభ్యర్ధులుగా ఉన్న ఎమ్మెల్సీ చైతన్యరాజు ఇప్పటికే నామినేషన్ వేశారు.  కొందరు ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకోవటంతో చైతన్యరాజు మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు. ఇక టీఆర్ఎస్ నుంచి కేశవరావు, టీడీపీ నుంచి సీతామహాలక్ష్మి, గరికిపాటి మోహనరావు నామినేషన్లు దాఖలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement