ఆ సినిమాలో నటించేందుకు సిద్ధపడ్డా: నటి | Kangana Ranaut almost signed an adult film | Sakshi
Sakshi News home page

బ్లూ ఫిలింలో నటించేందుకు సిద్ధపడ్డా: నటి

Jan 2 2017 10:37 AM | Updated on Sep 5 2017 12:12 AM

ఆ సినిమాలో నటించేందుకు సిద్ధపడ్డా: నటి

ఆ సినిమాలో నటించేందుకు సిద్ధపడ్డా: నటి

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ తాజాగా తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

జాతీయ అవార్డు గ్రహిత, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ తాజాగా తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 2006లో ‘గ్యాంగ్‌స్టర్‌’ సినిమాతో కంగనా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆఫర్‌ కనుక వచ్చి ఉండకపోతే.. తాను ఓ చెత్త సినిమాతో కెరీర్ ను ప్రారంభించి ఉండేదానని పేర్కొంది.

‘కెరీర్ లో నాకు వచ్చిన ‘గ్యాంగ్‌స్టర్‌’ సినిమాతోనే బ్రేక్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే అంతకన్నా ముందు నాకో సినిమా ఆఫర్‌ వచ్చింది. అది ఏమంతా మంచి సినిమా కాదు. అయినా, పర్వాలేదు చేద్దామనుకున్నా. ఆ తర్వాత ఫొటోషూట్‌ కూడా చేశాను. ఆ తర్వాత కాస్ట్యూమ్‌ రోబ్‌ ఇచ్చారు. అందులో దుస్తులేమీ లేవు. దీంతో అది నీలిచిత్రమేమో అనిపించింది. ఇది మంచి సినిమా కాదేమో, నేను చేయకూడదేమో అనిపించింది. ఇంతలోనే ‘గ్యాంగ్‌స్టర్‌’ సినిమా వచ్చింది. ఆ సినిమా నాకు నచ్చడంతో అదే చేశాను’ అని కంగనా తెలిపింది  

‘దీంతో ఆ సినిమా నిర్మాత నాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ ప్రాజెక్టును వదిలేయడం వల్ల కొన్ని కష్టాలు కూడా  పడ్డాను. అప్పట్లో నేను 17, 18 ఏళ్ల చిన్న వయస్సులో ఉన్నాను. గ్యాంగ్ స్టర్‌ ఆఫర్‌ కనుక రాకపోయి ఉంటే నేను ఆ సినిమా చేసి ఉండేదాన్ని. అప్పట్లో నేను ఉన్న పరిస్థితులు ప్రతి సినిమాకు ఓకే చెప్పు అన్నట్టుగా ఉండేవి’ అని ఆమె పేర్కొంది. బాలీవుడ్‌ ‘క్వీన్‌’గా పేరొందిన కంగన త్వరలో రంగూన్, రాణి లక్ష్మీబాయి, సిమ్రన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement