సంచలన వ్యాఖ్యలు చేసిన బ్యూటీ.. | Kamal Haasan daughter Akshara Haasan introduce in collywood Industry | Sakshi
Sakshi News home page

సంచలన వ్యాఖ్యలు చేసిన బ్యూటీ..

May 14 2017 10:12 PM | Updated on Sep 5 2017 11:09 AM

సంచలన వ్యాఖ్యలు చేసిన బ్యూటీ..

సంచలన వ్యాఖ్యలు చేసిన బ్యూటీ..

విజయాల క్రెడిట్‌ను ఓన్‌ చేసుకోవడం, అపజయాలకు ఇతరులను బాధ్యుల్ని చేయడం తెలివైన వారి పని.

విజయాల క్రెడిట్‌ను ఓన్‌ చేసుకోవడం, అపజయాలకు ఇతరులను బాధ్యుల్ని చేయడం తెలివైన వారి పని. కమలహాసన్‌ రెండో కూతురు అక్షరహాసన్‌ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారనిపిస్తోంది. ఈ బ్యూటీ తన అక్క శ్రుతీహాసన్‌ మాదిరిగానే నటిగా తొలుత బాలీవుడ్‌లో పరిచయం అయ్యారు. ఆ తరువాతనే ఇప్పుడు వివేగం చిత్రంతో కోలీవుడ్‌కు రానున్నారు. ఇందులో అజిత్‌ కథానాయకుడు, కాజల్‌అగర్వాల్‌ నాయకి. కాగా ఈ చిత్ర టీజర్‌ ఇటీవల విడుదలై మూడు రోజుల్లోనే కోటీ మంది వీక్షకులను ఆకట్టుకుంది.

ఇది ప్రపంచ రికార్డు అట. దీంతో అజిత్‌ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. వారితో పాటు సంతోషాన్ని పంచుకుంటున్న నటి అక్షరహాసన్‌. ఈ అమ్మడు తన ప్రపంచ రికార్డు సాధించిన చిత్రం తనదే అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తన చిత్రం ఈ రికార్డును సాధించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, ఇందుకు కారణం అయిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ చిత్ర కథానాయకుడు అజిత్, కథానాయకి కాజల్‌అగర్వాల్‌ల కంటే ముందే తాను వివేగం చిత్ర టీజర్‌ రికార్డును ఓన్‌ చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. ఈ విధంగా పాపులర్‌ అవ్వాలనుకుంటున్నారని భావించవచ్చు. ఈ భామకు తమిళంలో వివేగం తొలి చిత్రం అన్నది గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement