నాగార్జున, కీరవాణితో నాలుగోసారి.. | K Raghavendra Rao announces OmNamoVenkatesaya movie | Sakshi
Sakshi News home page

నాగార్జున, కీరవాణితో నాలుగోసారి..

Jun 23 2016 6:37 PM | Updated on Sep 4 2017 3:13 AM

నాగార్జున, కీరవాణితో నాలుగోసారి..

నాగార్జున, కీరవాణితో నాలుగోసారి..

అన్నమయ్య, రామదాసు, షిర్డీ సాయిబాబా వంటి భక్తిరస ప్రధానమైన చిత్రాలను తీసిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మరో అపూర్వమైన భక్తి చిత్రాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు.

హైదరాబాద్: అన్నమయ్య, రామదాసు, షిర్డీ సాయిబాబా వంటి భక్తిరస ప్రధానమైన చిత్రాలను తీసిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మరో అపూర్వమైన భక్తి చిత్రాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. హీరో నాగార్జున, సంగీత దర్శకుడు కీరవాణితో జత కట్టి ‘నమో వెంకటేశయా’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ నెల 25న (శనివారం) ముహూర్తం షాట్ తో ఈ చిత్ర షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్టు ఆయన ట్విట్టర్ లో తెలిపారు. ‘ఈ రోజే నేను, నాగార్జున, తిరుమల దర్శనం చేసుకుని తిరిగొచ్చా. నాగార్జున, కీరవాణిలతో నా నాలుగో భక్తిరస చిత్రాన్ని ఈ నెల 25న ముహూర్తం షాట్ తో ప్రారంభించబోతున్నాం’ అని తెలిపారు.

గడ్డం లేకుండా తొలిసారి..
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గడ్డం లేకుండా సాధారణంగా కనిపించరు. కానీ తాజాగా ఆయనే స్వయంగా ట్విట్టర్ లో గడ్డం లేని ఫొటోను పెట్టారు. తాను గడ్డంతో కనిపించడం వెనుక ఉన్న సంప్రదాయాన్ని కూడా ఆయన వెల్లడించారు. ‘జ్యోతి సినిమా అప్పట్నుంచి ప్రతీ సినిమా మొదలు పెట్టినప్పుడు గడ్డం తీసేసి.. షూటింగ్ పూర్తి అయిన రోజునే మళ్ళీ తీస్తాను. అదే సాంప్రదాయాన్ని ఈ సినిమాకి (నమో వెంకటేశాయ) కూడా కొనసాగించాలనుకుంటున్నాను’ అని ట్విట్టర్ లో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement