న్యాయమూర్తికి బెదిరింపు ఎస్సెమ్మెస్ | Judge gets threatening SMS, security heightened | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తికి బెదిరింపు ఎస్సెమ్మెస్

Aug 27 2015 4:17 PM | Updated on Aug 28 2018 7:22 PM

గుర్తు తెలియని వ్యక్తి నుంచి తనకు అనుకూలమైన తీర్పు ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఛత్తీస్గడ్ న్యాయమూర్తి మహాదేవ్ కతుకర్కు బెదిరింపు ఎస్సెమ్మెస్ వచ్చింది

బిలాస్పూర్(ఛత్తీస్గఢ్): గుర్తు తెలియని వ్యక్తి నుంచి తనకు అనుకూలమైన తీర్పు ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఛత్తీస్గడ్ న్యాయమూర్తి మహాదేవ్ కతుకర్కు బెదిరింపు ఎస్సెమ్మెస్ వచ్చింది. ఓ విడాకుల కేసుకు సంబంధించి ఆయన తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో బెదిరింపు వచ్చింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.

ఈ ఎస్సెమ్మెస్ వచ్చిన సమయంలో న్యాయమూర్తి మహదేవ్ 2013లో జైరాం లోయలో జరిగిన మావోయిస్టుల దాడికి సంబంధించిన కేసును పరిశీలిస్తున్నారు. బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో న్యాయమూర్తికి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఆయనకు మావోయిస్టులు చంపేస్తామంటూ బెదిరింపు లేఖ పంపించారు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement