కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా జయా బచ్చన్ | Jaya Bachchan as the new brand ambassador of Kalyan Jewellers | Sakshi
Sakshi News home page

కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా జయా బచ్చన్

Nov 4 2015 1:24 AM | Updated on Sep 3 2017 11:57 AM

కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా జయా బచ్చన్

కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా జయా బచ్చన్

కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినిమా తార జయా బచ్చన్ వ్యవహరించనున్నారు.

హైదరాబాద్: కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినిమా తార జయా బచ్చన్ వ్యవహరించనున్నారు. ఆమె భర్త అమితాబ్ బచ్చన్ ఇప్పటికే ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. అనేక రకాల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే భారతీయ మహిళకు జయా బచ్చన్ ప్రతిరూపమని, ఆమెతో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేలా ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని కల్యాణ్ జ్యువెలర్స్ సీఎండీ టి.ఎస్.కల్యాణ రామన్  చెప్పారు.

తమ జాతీయ బ్రాండ్ అంబాసిడర్ అయిన అమితాబ్ బచ్చన్, కొత్త బ్రాండ్ అంబాసిడర్ జయా బచ్చన్‌లపై కొత్తగా టీవీ కమర్షియల్(టీవీసీ)ను తీశామని తెలిపారు. దీన్లో తమ తాజా ఉత్పత్తి-ముద్ర కలెక్షన్ గురించి ఉంటుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement